పోలీసులను వెంటపడి కొట్టారు…!

-

కరోనా దెబ్బకు ప్రభుత్వాలు లాక్ డౌన్ ని చాలా సీరియస్ గా అమలు చేస్తున్నాయి, చాలా దేశాల్లో ఇది అమలు జరుగుతూ వస్తుంది. లాక్ డౌన్ ని అమలు చేయడానికి అవసరం అయితే కొత్త చట్టాలను కూడా తీసుకొచ్చే ప్రయత్నంలో ఉన్నాయి కొన్ని దేశాలు. కరోనా వ్యాప్తి ఆగాలి అంటే సామాజిక దూరం పాటించాలి. అందుకే ఈ లాక్ డౌన్ సహా కొన్ని కార్యక్రమాలు… ప్రజలు మాత్రం చాదస్తం తో వినడం లేదు.

దీనితో పోలీసులు లాఠీలకు పని చేస్తున్నారు. మన దేశంలో పోలీసులు లాక్ డౌన్ ఉల్లంఘన విషయంలో చాలా సీరియస్ గా ఉన్నారు. ఇక మన దాయాది పాకిస్తాన్ లో కూడా లాక్ డౌన్ విషయంలో పోలీసులు సీరియస్ గానే వ్యవహరిస్తున్నారు. ప్రజలు బయటకు వస్తే తాట తీస్తున్నారు. అయితే ఈ తరుణంలో కొందరు పోలీస్లు అతి చేస్తున్నారు అనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఇష్టం వచ్చినట్టు కొడుతున్నారు.

తాజాగా పాకిస్తాన్ లోని కరాచిలో ఇదే జరిగింది. ఏమీ లేదు… అక్కడ జనాలు గుమి గూడి ఉండటంతో గమనినించిన పోలీసులు వారిని లోపలి వెళ్లాలని బలవంతంగా చెప్పారు. అసలే మేము నిత్యావసర సరుకుల కోసం చస్తుంటే ఈ గోల ఏంటీ అంటూ ప్రజలు అందరూ కూడా పోలీసుల మీద ఎదురు దాడి చేసారు. రాళ్ళు వేసి పోలీసులకు చుక్కలు చూపించారు. దీనితో చేసేది ఏమీ లేక పోలీసులు పారిపోయారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version