బ్రేకింగ్; తెలంగాణాలో ఈ ఒక్కరోజే 66 కరోనా కేసులు…!

-

తెలంగాణాలో కరోనా వైరస్ కేసులు అత్యంత వేగంగా పెరుగుతున్నాయి. తాజాగా తెలంగాణాలో 66 కేసులు బయటపడ్డాయని తెలంగాణా ఆరోగ్య శాఖ ప్రకటన విడుదల చేసింది. ఈ కేసుల్లో ఎక్కువ భాగం హైదరాబాద్ పరిధిలోనే నమోదు కావడం ఆందోళన కలిగిస్తుంది. తాజా కేసుల సంఖ్యతో తెలంగాణాలో 766 కి చేరుకున్నాయి కేసులు. ఒక్క హైదరాబాద్ లోనే 427 కేసులు ఉన్నాయి. ఈ రోజు మరణాలు ఏమీ నమోదు కాలేదు. ఇక ఎవరూ కూడా డిశ్చార్జ్ కాలేదు. ఈ రోజు మొత్తం 66 కేసులు నమోదు అయ్యాయి.

తెలంగాణాలో మొత్తం యాక్టివ్ కేసులు 562 గా ఉన్నాయి. ఇప్పటి వరకు 18 మంది తెలంగాణాలో మరణించారు. హైదరాబాద్ తర్వాత నిజామాబాద్ లో ఎక్కువ కేసులు నమోదు అయ్యాయి. హైదరాబాద్ లో యాక్టివ్ కేసుల సంఖ్య 286 గా ఉంది. 131 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటికే హైదరాబాద్ ని పూర్తిగా మూసి వేసింది సర్కార్. అటు మంత్రులు కూడా హైదరాబాద్ లో అప్రమత్తంగా ఉంటున్నారు. ఎప్పటికప్పుడు సిఎం కేసీఆర్ హైదరాబాద్ కి సంబంధించిన సమాచారం సేకరిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version