కర్నూలు జిల్లాలోకి నల్లమలలో గూడ్స్ వాహనాల రాకపోకలపై ఆంక్షలు విధిస్తున్నారు పోలీసులు. శ్రీశైలం శివరాత్రి బ్రహ్మోత్సవాల నేపథ్యంలో నల్లమలలో గూడ్స్ వాహనాల రాకపోకలపై ఆంక్షలు విధిస్తున్నారు పోలీసులు. ట్రాఫిక్ జామ్, రోడ్డు ప్రమాదాల దృష్టితో రవాణా అధికారుల ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు.
కర్నూలు-గుంటూరు మధ్య వెళ్లే గూడ్స్ వాహనాలు నంద్యాల, గిద్దలూరు మీదుగా వెళ్లాలని సూచనలు చేస్తున్నారు. ఆంక్షలు అతిక్రమిస్తే రూ.25వేల నుంచి రూ.50 వేల వరకు జరిమానా విధిస్తామని హెచ్చరికలు జారీ చేస్తున్నారు పోలీసులు.