వాక్సిన్ రిజిస్ట్రేషన్ చేయించుకునే వాళ్లకు ఈ విషయం తెలుసా…?

-

కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమానికి సంబంధించి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ప్రజలకు స్పష్టమైన సమాధానం ఇవ్వడం లేదు అనే ఆరోపణలు ఎక్కువగా వినబడుతున్నాయి. వ్యాక్సిన్ విషయంలో అధికారులు కూడా ఏమీ చెప్పకపోవడంతో ప్రజలు రోడ్ల మీద తిరిగే పరిస్థితి ఏర్పడింది. ఇదిలా ఉంటే తెలంగాణలో ఇవాళ్టి నుంచి మే 12 వరకు రెండవ డోస్ వారికి మాత్రమే వ్యాక్సిన్ ఇవ్వడం జరుగుతుంది.

మొదటి డోస్ వారికి మే 12 వరకు నో వ్యాక్సిన్ అని స్పష్టం చేసింది సర్కార్. ఇవాళ్టి నుంచి వ్యాక్సిన్ సెంటర్ల వద్దే రిజిస్ట్రేషన్ చేయించుకునే అవకాశం ఉంటుంది. రెండవ డోస్ కోసం వ్యాక్సినేషన్ కేంద్రాల వద్ద క్యూ కడుతున్నారు.హఫీజ్ పేట్ ప్రభుత్వ ఆసుపత్రి వద్ద తెల్లవారుజాము నుంచి బారులు తీరిన ప్రజలు… వ్యాక్సిన్ విషయంలో ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు. మొదటి డోస్ నిలిపివేయడంతో జనం వెనుతిరుగుతున్న పరిస్థితి ఉంది.రిజిస్ట్రేషన్ చేసుకున్న రెండో వారికి వ్యాక్సిన్లు అందటం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు..

Read more RELATED
Recommended to you

Exit mobile version