ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రస్తుతం అప్పుల్లో కూరుకు పోయిన సంగతి తెలిసిందే. అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న నేపథ్యంలో… ఏపీ ఆర్థిక వ్యవస్థ చాలా చిన్నాభిన్నం గా తయారైంది. ఇష్టం వచ్చినట్లు ఖర్చు పెడుతున్నారు. ఈ నేపథ్యంలోనే… బడ్జెట్ కేటాయింపులు లేకుండానే ఈ ఆర్థిక సంవత్సరంలో ఏకంగా 94 వేల కోట్లు ఖర్చు చేసింది జగన్మోహన్రెడ్డి సర్కార్.
ఈ విషయాన్ని అకౌంటెంట్ జనరల్ స్పష్టంగా చెప్పారు. కేటాయింపులు లేనప్పుడు ఈ అనుమతులు లేనట్లే. అసలు బడ్జెట్ నిబంధనలు ఉల్లంఘించి ఇంత పెద్ద మొత్తాన్ని ఖర్చు చేశారని దాని అర్థం. ఏపీ ప్రభుత్వ తీరుపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ అకౌంటెంట్ జనరల్ బహిరంగ లేఖ పంపారు.
నిబంధనల ప్రకారం ఒక్క రూపాయి ఖర్చు చేయాలన్న బడ్జెట్ను ప్రతిపాదించి బడ్జెట్కు ఆమోదం పొందాల్సి ఉంటుంది. కానీ దానికి భిన్నంగా ఏకంగా 94 వేల కోట్ల రూపాయలను ఖర్చు చేయడం పట్ల యేజీ కార్యాలయం విస్తుపోయింది. సంక్షేమ పథకాలకు భారీగా నిధులను బడ్జెట్లో ఆమోదించింది. అంటే కేటాయింపులు లేకుండా 94 కోట్ల రూపాయలను ఎక్కడ ఖర్చు చేశారనే దానిపై వివరాలు తెలియాల్సి ఉంది.