ఈ మూడున్నర ఏళ్లలో సీఎం జగన్ ఓ మోడల్ గా నిలిచారని అన్నారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. ఎస్పీ ,ఎస్టీ గెజిటెడ్ వెల్ఫేర్ అసోసియేషన్ డైరీ ఆవిష్కరణలో పాల్గొన్న సజ్జల మాట్లాడుతూ.. ప్రతిపక్షం మాయలమరాటీగా మీడియా మొత్తాన్ని గుప్పిట్లో పెట్టుకుని అబద్దాలని ప్రచారం చేస్తున్నాయని ఆరోపించారు.
మీ సామాజిక వర్గంలో గతంలో పరిస్ధితులు…ఇపుడు ఈ ప్రభుత్వంలో ఉన్న పరిస్ధితులని చూస్తున్నారని.. ఎస్సీలలో పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా అని 2019 వరకు అధికారంలో ఉన్నవ్యక్తి అనలేదా..? అని ప్రశ్నించారు. ఇపుడు అదే వ్యక్తి తన చంద్రన్నకానుక అంటున్నారని మండిపడ్డారు. మా పార్టీ డిఎన్ఎ లోనే ఎస్సి,ఎస్టి, బిసిలు ఉన్నారన్నారు సజ్జల. విద్య, వైద్యం ద్వారా ఎస్సీ,ఎస్టీలకి మేలుజరిగేలా వైఎస్సార్ హయాంలో అడుగులు పడ్డాయన్నారు.
జగన్ విద్య, వైద్యాన్ని బలహీనవర్గాలకి మరింత చేరువ చేశారని తెలిపారు సజ్జన. పేదవాడు పేదవాడిగానే ఉండాలనేది గత పాలకుల ఆలోచన అన్నారు. బహుజనుల పేరు చెప్పుకుని వచ్చిన పార్టీలు సైతం అదే దారిలో వెళ్లాయన్నారు. నేటికీ పార్లమెంట్ లో మహిళా బిల్లుని రానివ్వరన్నారు. కానీ సిఎం జగన్ ఎస్సి, ఎస్టి, బిసిలకి 50 శాతం రిజ్వేషన్లు అమలు చేశారని… అందులోనూ 50 శాతం మహిళలకి రిజర్వేషన్లు కల్పించారని తెలిపారు.