తనపై వచ్చిన ట్రోల్స్ కు గట్టిగా బదులు ఇచ్చిన ఎన్టీఆర్.!

-

రీసెంట్ గా లాస్ ఏంజెల్స్ లో గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ ఫంక్షన్ లో  బెస్ట్ ఒరిజినల్ స్కోర్ విభాగంలో ‘నాటు నాటు’ సాంగ్ కు గానూ ఆర్ ఆర్ ఆర్ మూవీ  గోల్డెన్ గ్లోబ్ అవార్డ్ సాధించింన  సంగతి అందరికీ తెలిసిందే. దీనితో దేశం మొత్తం ఆర్ ఆర్ ఆర్ మూవీ మేనియా తో ఊగిపోయింది. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు అందరూ RRR టీం కు అభినందనలు తెలిపారు.

సాక్షాత్తు దేశ ప్రధాని మంత్రి మోదీ గారు కూడా ఆర్ ఆర్ ఆర్ మూవీ టీమ్ కు అభినందనలు తెలిపారు. ఇక రాజమౌళి టీమ్ కూడా అమెరికాలో కూడా తెగ ఎంజాయ్ చేస్తున్నారు. అలాగే అక్కడి మీడియా వారికి ఇంటర్వ్యూ లు ఇస్తూ సందడి చేస్తున్నారు. అలాగే అక్కడి హలీవుడ్ ప్రముఖుల తో పరిచయాలు పెంచుకుంటూ హంగామా చేసారు. ఇదే పర్యటన లో జూ ఎన్టీఆర్ కూడా పాల్గొని అమెరికన్ ఇంగ్లీష్ లో అదరగొట్టిన సంగతి తెలిసిందే.

అయితే కొందరు మాత్రం ఇది అమెరికన్ యాస పై దారుణంగా  ట్రోల్స్ చేశారు. సాధారణంగా ఇంగ్లీష్ మాట్లాడితే పోయేది కదా. అమెరికన్ స్లాంగ్ పేరుతో ఎన్టీఆర్ అర్థం కాకుండా మాట్లాడాడు అంటూ కొందరు సోషల్ మీడియా లో విమర్శలు గుప్పించారు.తాజాగా ఒక అంతర్జాతీయ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన స్లాంగ్ పై వచ్చిన ట్రోల్స్ కు స్పందించాడు. దేశాన్ని బట్టి ఒక్కో యాస ఉంటుంది.ఎవరి భాష వారిది.. ఎవరి యాస వారిది దాని కంత విమర్శలు ఎందుకు అన్నట్లుగా ఎన్టీఆర్ కామెంట్స్ చేసాడు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version