ప్రముఖ యూట్యూబ్ ఛానల్ ద్వారా మంచి పాపులారిటీ దక్కించుకున్న దేత్తడి హారిక బిగ్ బాస్ తో మరింత పాపులారిటీని సంపాదించుకుంది. ప్రస్తుతం గ్లామర్ షోలో ఏమాత్రం తగ్గకుండా సోషల్ మీడియాలో మరింత రచ్చ చేస్తూనే ఉంది ఈ ముద్దుగుమ్మ. ఈ క్రమంలోనే తాజాగా ఒక రిసార్టులో స్టన్నింగ్ లుక్కుతో ఫోటోలకు ఫోజులిచ్చింది. ఒక యూట్యూబర్ గా దేత్తడి హారిక యూత్ లో మంచి క్రేజ్ సంపాదించుకున్న విషయం తెలిసిందే. ఆ క్రేజీతోనే బిగ్ బాస్ సీజన్ ఫోర్ లో టాప్ 5 లో ఒకరిగా నిలిచింది. ఈ షో తో భారీ పాపులారిటీ సంపాదించుకున్న హారిక ఆ తర్వాత సోషల్ మీడియాలో మరింత పాపులారిటీ సొంతం చేసుకుందని చెప్పవచ్చు.
సినిమాలలో నటించాలనే ఆలోచనతోనే చాలామంది యంగ్ బ్యూటీలు సోషల్ మీడియాను ఆయుధంగా వాడుతూ మరింత పాపులారిటీ పెంచుకుంటున్నారు. ఈ క్రమంలోనే గ్లామర్ షో తో మరింత రెచ్చిపోతున్నారు అని చెప్పవచ్చు. ఇప్పుడు తాజాగా బిగ్ బాస్ తో సెలబ్రిటీ హోదాను సంపాదించుకున్న హారిక కూడా గ్లామర్ షో తో మరింత సందడి చేస్తోంది. బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత నెట్టింట ఈమె చేస్తున్న రచ్చ మామూలుగా లేదని చెప్పవచ్చు. అంతకుముందు పద్ధతిగానే తన ఆటిట్యూడ్ తో అందరినీ ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ తాజాగా టైట్ ఫిట్ లో మరింతగా నెటిజన్లను కవ్విస్తోంది.
తన అందాలను ఎరగా వేస్తూ నేటిజెన్లను తన వైపు తిప్పుకుంటున్న ఈ యంగ్ బ్యూటీ పరువాల ప్రదర్శనతో మెస్మరైజ్ చేస్తోంది. రెడ్ కలర్ డ్రెస్సును బాడీకి అతుక్కుపోయేలా వేసుకొని తన అందాలను ప్రదర్శించింది. ఫ్రంట్ బ్యాక్ చూపిస్తూ మతులు పోగొడుతుంది ఈ ముద్దుగుమ్మ. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు బాగా వైరల్ గా మారుతున్నాయి.