Breaking : సీఎం జగన్ కటౌట్‌కు నిప్పుపెట్టిన దుండగులు

-

కృష్ణా జిల్లాలో మచిలీపట్నం-విజయవాడ జాతీయ రహదారి పక్కన గూడురు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద ఏపీ సీఎం జగన్‌
కటౌట్ ను వైసీపీ శ్రేణులు ఏర్పాటు చేశాయి. అయితే.. సీఎం జగన్ కటౌట్ కు గుర్తు తెలియని దుండగులు నిప్పు పెట్టారు. అర్ధరాత్రి సమయంలో నిప్పంటించారు. దీంతో ముఖ్యమంత్రి కటౌట్ సగం కాలింది. కటౌట్ ను దగ్ధం చేయడంపై వైసీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనను తీవ్రంగా ఖండించారు. మరోవైపు బందరు డీఎస్సీ బాషా, పెడన రూరల్ సీఐ ప్రసన్న గౌడ్, గూడూరు ఎస్సై వెంకట్ ఘటనా స్థలికి చేరుకుని పరిశీలించారు.

పెడనలో చేనేత కార్మికులకు చేయూత పథకాన్ని ఇవ్వడానికి జగన్ వచ్చిన సందర్భంగా ఈ కటౌట్ ను ఏర్పాటు చేశారు. ఈ ఘటనపై స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ కారుమంచి కామేశ్వరరావు మాట్లాడుతూ… ఇది దుర్మార్గమైన చర్య అని అన్నారు. రాజకీయాల్లో అనేక గొడవలు ఉంటాయి కానీ, కటౌట్లకు నిప్పు అంటించడమనేది సరైనది కాదని చెప్పారు. ఏదైనా ఉంటే ముఖాముఖి మాట్లాడుకుని సమస్యను పరిష్కరించుకోవాలని హితవు పలికారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version