బంగ్లాదేశ్‌లో హిందువులపై ఆగని దాడులు.. కేంద్రం రియాక్షన్

-

మన పొరుగున ఉన్న బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడులు ఆగడం లేదు. తాజాగా ఈ దాడులపై కేంద్ర ప్రభుత్వం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది.గతేడాది నవంబర్ 26 నుంచి జనవరి 25 వరకు హిందువులే లక్ష్యంగా 76 దాడులు జరిగినట్లు విదేశాంగ శాఖ సహాయమంత్రి కీర్తి వర్ధన్ సింగ్ ఆదివారం లోక్‌సభలో లిఖితపూర్వకంగా సమాధానమిచ్చారు.

బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్న హింస ఆందోళనకరమని చెప్పారు. గతేడాది ఆగస్టు నుంచి 23 మంది హిందువులు ప్రాణాలు కోల్పోయారని, 152 దేవాలయాలపై దాడులు జరిగాయని వివరించారు. ఇక గతేడాది డిసెంబర్ 9న విదేశాంగ కార్యదర్శి బంగ్లాదేశ్ పర్యటన చేపట్టిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా హిందువులు, మైనారిటీల రక్షణ కోసం అక్కడి ప్రభుత్వంతో చర్చలు జరిపినట్లు విషయాన్ని ఈ సందర్బంగా గుర్తుచేశారు.

 

Read more RELATED
Recommended to you

Latest news