మద్యం మత్తులో ఉన్న తనయుడు తండ్రిని కిరాతకంగా హతమార్చాడు. ఏకంగా రంపంతో కోసి చంపిన ఘటన ఏపీలో కలకలం రేపింది.ఈ ఘటన రాష్ట్రంలోని ప్రకాశం జిల్లా దొనకొండ మండలం ఇండ్లచెరువు గ్రామంలో ఆదివారం ఆలస్యంగా చోటుచేసుకుంది.
ఎస్సీ కాలనీలో ఉంటున్న పైడిపోగు యేసయ్య (64) అనే వ్యక్తిని అతడి కొడుకు మరియ దాసు హత్య చేశాడు. నిద్రలో ఉన్న తండ్రిని చంపి..అనంతరం రంపంతో కోశాడు. విషయం తెలుసుకున్న స్థానికులు ఆ యువకుడిని బంధించి పోలీసులకు అప్పగించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కాగా, ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.