ఫ్యాక్ట్ చెక్: ఆదాయపు పన్ను శాఖ ఏదైనా లక్కీ డ్రాను నిర్వహిస్తుందా ?

-

ఈ మధ్య ఆన్ లైన్ లో ఎక్కువ మోసాలు జరుగుతున్న సంగతి తెలిసిందే..సైబర్ నేరగాళ్ళు కూడా ఇలాంటి వాటిని ఎక్కువగా చేస్తున్నారు.కొందరు అది తెలుసుకోలేక మోసపోతున్నారు. డబ్బులు గెలుచుకొనే అవకాశం ఉందంటూ మెయిల్స్, మెసేజ్ లు చేస్తున్నారు.. తాజాగా లాటరీ తగిలిందని మోసగాళ్లు ఈ-మెయిల్‌లు, సందేశాలు పంపిస్తున్నారు.ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో అధికారిక ఫ్యాక్ట్ చెక్ ట్విటర్ హ్యాండిల్ ‘PIB ఫాక్ట్ చెక్’ సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్న నకిలీ లాటరీ ప్రకటన గురించి అందరినీ అప్రమత్తం చేసింది..గతంలో చాలా మంది ఇలాంటి చిన్నచిన్న వాటికి రెస్పాండ్ అయ్యి వ్యక్తిగత సమాచారాన్ని అందించి, డబ్బులను పోగొట్టుకున్న సంఘటనలు ఎక్కువగానే ఉన్నాయి.

కౌన్ బనేగా కరోడ్‌పతి (కెబిసి) సంయుక్తంగా నిర్వహించిన రూ. 8,388 లాటరీని గ్రహీత గెలుచుకున్నట్లు మోసపూరిత లాటరీ ప్రకటన పేర్కొంది. దీనికి, ప్రభుత్వ తనిఖీ విభాగం, ఈ లాటరీ స్కామ్ అని పిఐబి పేర్కొంది..దీనిని ప్రజలు నమ్మవద్దని మరోసారి హెచ్చరించారు..ఇలాంటి లాటరీ మోసాల పట్ల జాగ్రత్త వహించండి. అలాంటి కాల్స్, మెయిల్స్ మరియు మెసేజ్‌లపై మీ వ్యక్తిగత సమాచారాన్ని షేర్ చేయవద్దు’’ అని పీఐబీ ఫ్యాక్ట్ చెక్ ట్వీట్ చేసింది..ప్రభుత్వ శాఖ ఎప్పుడూ ఇలాంటి వాటి గురించి మెసేజ్, మెయిల్ చేయదని స్పష్టం చేసింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version