రైల్వే ఛార్జీలు పెంపు.. క్లారిటీ ఇచ్చిన కేంద్ర ప్ర‌భుత్వం

-

దేశ వ్యాప్తంగా గ‌త కొద్ది రోజుల నుంచి పెట్రోల్, డీజిల్ ధ‌ర‌లు విపరీతంగా పెరుగుతున్నాయి. పెట్రోల్ డీజిల్ ధ‌ర‌లు పెర‌గ‌డంతో రవాణా ఛార్జీల‌ను కూడా రాష్ట్ర ప్ర‌భుత్వం పెంచేస్తున్నాయి. ఇప్ప‌టికే తెలుగు రాష్ట్రాల్లో ప్ర‌భుత్వాలు రవాణా ఛార్జీల‌ను పెంచాయి. డీజిల్ సెస్ అనే పేరుతో ఆర్టీసీ ఛార్జీల‌ను ఆంధ్ర ప్ర‌దేశ్ లోని జ‌గ‌న్ స‌ర్కార్, తెలంగాణ‌లోని కేసీఆర్ స‌ర్కార్ పెంచేశాయి. డీజిల్ ఛార్జీలు పెర‌గ‌డంతో అన్ని ర‌కాల ర‌వాణా ఛార్జీలు పెరిగే అవ‌కాశం ఉంద‌ని గ‌త కొద్ది రోజుల నుంచి సోషల్ మీడియాలో తెగ ప్ర‌చారం అవుతుంది.

ముఖ్యంగా సామాన్యులు ఎక్కువగా ఉప‌యోగించే.. రైల్వే ఛార్జీల‌ను కేంద్ర ప్ర‌భుత్వం త్వ‌ర‌లోనే పెంచబోతుంద‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. రైల్వే పై లెవీ ఛార్జ్ వేసి టికెట్ ధ‌ర‌ల‌ను పెంచే అవ‌కాశం ఉంద‌ని ఆ వార్తల సారాశం. అయితే ఈ వార్త‌ల‌పై కేంద్ర రైల్వే శాఖ స్పందించింది.రైల్వే ఛార్జీల‌ను పెంచ‌బోతున్న‌ట్టు సోషల్ మీడియాల్లో వ‌స్తున్న వార్త‌ల్లో వాస్త‌వం లేద‌ని తెల్చి చెప్పింది. ఆ వార్త‌ల‌న్ని వ‌ట్టి పుకార్లేన‌ని కొట్టిపారేసింది. ప్ర‌స్తుతానికి రైల్వే ఛార్జీల‌ను పెంచే ఆలోచ‌న కేంద్ర ప్ర‌భుత్వం ముందు లేద‌ని స్ప‌ష్టం చేసింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version