కేసీఆర్ మరో కీలక నిర్ణయం..మున్సిపాలిటీల్లోని ప్రజా ప్రతినిధుల జీతాలు 30 శాతం పెంపు

-

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. మున్సిపాలిటీలోని ప్రజాప్రతినిధుల జీతాలను పెంచుతూ కీలక నిర్ణయం తీసుకున్నారు. మేయర్స్, డిప్యూటీ మేయర్, మున్సిపల్ చైర్ పర్సన్, వైస్ చైర్మన్ లు అలాగే కార్పొరేటర్లు, కౌన్సిలర్ల గౌరవ వేతనాన్ని పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు సీఎం కేసీఆర్.

మున్సిపల్ శాఖ లోని ఈ ప్రజాప్రతినిధుల జీతాలను ఏకంగా 30 శాతం పెంచాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ పెంచిన జీతాలను ఈ ఏడాది జూన్ ఒకటో తేదీ నుంచి అమలు చేయాలని స్పష్టం చేశారు.తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు. తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ నిర్ణయం మేరకు ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. తాజా ఉత్తర్వుల ప్రకారం.. 50000 ఉన్న మేయర్ల జీతం 65 వేలకు చేరనుంది. అలాగే మున్సిపల్ చైర్ పర్సన్ జీతం రూ. 19500 లకు చేరనుంది. ఇక వార్డు మెంబర్ల జీతాలు రూ.4550 లకు చేరనుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version