IND VS SA : సౌత్ ఆఫ్రికా బౌలర్ల విజృంబణ….. భారత్ ఆలౌట్

-

దక్షిణాఫ్రికా పర్యటనలో భాగంగా ఈరోజు టీమిండియా రెండవ వన్డే ఆడుతుంది. ఈ మ్యాచ్ కి కేఎల్ రాహుల్ సారథ్యం వహిస్తున్నాడు. టాస్ గెలిచిన సౌత్ ఆఫ్రికా బౌలింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్ కి దిగిన ఇండియా 46.2 ఓవర్లలో 211 పరుగులకు ఆల్ అవుట్ అయింది. తొలి ఇన్నింగ్స్ ఆరంభించిన భారత్ కు ఆదిలోనే షాక్ తగిలింది రుతురాజ్ కేవలం నాలుగు పరుగులు చేసి ఇన్నింగ్స్ రెండో బంతికి ఔట్ అయ్యాడు. ఆ తర్వాత వచ్చిన తిలక్ వర్మ కూడా పెద్దగా ఆకట్టుకోలేకపోయానడు. భారత బ్యాట్స్మెన్లలో ఎవరు కూడా మంచి భాగస్వామ్యాలు నిర్మించలేదు.సాయి సుదర్శన్ 83 బంతులలో 62 పరుగులు చేసి హాఫ్ సెంచరీ సాధించాడు. కేఎల్ రాహుల్ 64 బంతుల్లో 56 పరుగులు చేశాడు. సంజు సాంసంగ్ 12 పరుగులు చేసి హెండ్రిక్స్ బౌలింగ్లో ఔట్ అయ్యాడు.రింకు సింగ్ (17), కుర్దీప్ యాదవ్ (1)లను కేశవ్ మహరాజ్ వరుస ఓవర్లలో పెవిలియన్కు పంపాడు. అక్షర్ పటేల్ 7 ని మారమ్ ఔట్ చేశాడు. చివర్లో అర్ష్దీప్ సింగ్ 18 పోరాడటంతో స్కోరు 200 దాటింది.

 

సౌతాఫ్రికా బౌలర్లలో నండ్రి బర్గర్ 3, బ్యురాన్ హెండ్రిక్స్ 2, కేశవ్ మహరాజ్ 2, లిజాడ్ విలియమ్స్, మార్క్రమ్ ఒక్కో వికెట్ పడగొట్టారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version