పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్ (POK) సహా పాకిస్తాన్‌లోని అనేక ప్రాంతాల్లో ఉన్న ఉగ్రవాద స్థావరాలపై భారత్ ఇటీవల నిర్వహించిన వైమానిక దాడులు దేశవ్యాప్తంగా తీవ్ర భయాన్ని కలిగించాయి. మే 7, 2025న జరిగిన ఈ ఎయిర్ స్ట్రైక్స్‌లో భారత వాయుసేన కీలక ఉగ్ర స్థావరాలను లక్ష్యంగా చేసుకొని విజయవంతంగా ధ్వంసం చేసింది. ఈ చర్యలతో పాకిస్తాన్‌లో భద్రతా పరిస్థితి తీవ్ర ఉద్రిక్తతకు లోనైంది. ఈ పరిణామాల నేపథ్యంలో, పాక్ నేషనల్ అసెంబ్లీలో PMLN పార్టీకి చెందిన ఎంపీ తాహిర్ ఇక్బాల్ భావోద్వేగానికి లోనై, “అల్లాహ్ మన హిఫాజత్ చేయాలి” అంటూ కన్నీటి పర్యంతమయ్యారు.
ఆయన భావోద్వేగాలతో మాట్లాడిన దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. భారత దాడుల తర్వత, పాక్ రక్షణ మంత్రి ఖ్వాజా ఆసిఫ్‌తో పాటు పలు కీలక నాయకుల్లో భయభ్రాంతులు నెలకొన్నట్టు తెలుస్తోంది. పాకిస్తాన్ ప్రతీకార దాడి చేయడానికి భారత్‌లోని 15 నగరాలను లక్ష్యంగా చేసేందుకు ప్రయత్నించినా, ఆ యత్నం విఫలమైంది. ఇందులో 7 నగరాలు పంజాబ్ రాష్ట్రానికి చెందినవిగా గుర్తించబడ్డాయి. పాక్ ప్రయోగించిన కొన్ని మిస్సైళ్ళను భారత S-400 క్షిపణి రక్షణ వ్యవస్థ సమర్థవంతంగా అడ్డుకుని, వాయుమార్గంలోనే ధ్వంసం చేసింది. ఈ చర్య పాకిస్తాన్‌కు మరొక గట్టి హెచ్చరికగా మారింది. భారత దళాల ప్రామాణికత, రక్షణ సాంకేతికత స్థాయిని ప్రపంచం మళ్లీ గుర్తించింది.