దేశంలో కొత్తగా 1,542 కరోనా కేసులు

-

ప్రపంచ దేశాలను భయాందోళనలకు గురిచేసిన కరోనా రక్కసి ఇప్పడిప్పుడే తగ్గుముఖం పడుతోంది. మొన్నటి వరకు భారీగా నమోదైన కరోనా కేసుల తగ్గుముఖం పట్టాయి. అయితే.. తాజాగా.. దేశంలో కరోనా వైరస్‌ కేసులు క్రితం రోజుతో పోలిస్తే స్వల్పంగా తగ్గాయి. సోమవారం రెండు వేలకుపైనే కరోనా కేసులు నమోదవ్వగా.. తాజాగా 1,542 కొత్త కేసులు వెలుగు చూసినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. దీంతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 44,632,430కి చేరింది. ఇక నిన్న 1,919 మంది కొవిడ్‌ నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో 26, 449 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి.

గత 24 గంటల్లో కరోనా కారణంగా ఎనిమిది మంది మృతి చెందగా.. మొత్తం మరణాల సంఖ్య 5,28,913కి చేరినట్లు వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇక మొత్తం కేసుల్లో 0.06 శాతం కేసులు యాక్టివ్‌గా ఉన్నాయని, రికవరీ రేటు 98.76 శాతం, మరణాలు 1.19 శాతంగా ఉన్నాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 219.37 కోట్ల కరోనా వ్యాక్సిన్‌ డోసులు పంపిణీ చేసినట్లు వెల్లడించింది కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ.

Read more RELATED
Recommended to you

Exit mobile version