ఇండియాలో కొత్త‌గా 7,774 క‌రోనా కేసులు, 306 మ‌ర‌ణాలు

-

ఇండియాలో కరోనా మహమ్మారి కేసులు… ఓ రోజు తగ్గుతూ ఓ రోజు పెరుగుతూ వస్తున్నాయి. అలాగే కరోనా మరణాలు కూడా క్రమంగా పెరుగుతూ వస్తున్నాయి. అయితే తాజాగా… కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన కరోనా హెల్త్ బులిటెన్ ప్రకారం.. ఇండియా వ్యాప్తంగా గడచిన 24 గంటల్లో కొత్తగా 7774 కరోనా కేసులు కొత్తగా నమోదు అయ్యాయి. ఇక గడచిన 24 గంటల్లో… ఏకంగా 306 మంది కరోనా కారణంగా మరణించారని హెల్త్ బులిటెన్ లో పేర్కొంది కేంద్ర ప్రభుత్వం.

అలాగే ప్రస్తుతం దేశవ్యాప్తంగా ప్రస్తుతం యాక్టివ్ గా ఉన్న కేసుల సంఖ్య..92, 281 గా ఉన్నట్లు స్పష్టం చేసింది ఆరోగ్యశాఖ. ఇక గ‌డిచిన 24 గంట‌ల్లో దేశ వ్యాప్తంగా 8,464 మంది క‌రోనా నుంచి కోలుకుని.. ఆస్ప‌త్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇక ఇప్ప‌టి వ‌ర‌కు మొత్తం డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 34122795 కు చేర‌గా.. మ‌ర‌ణాలు 475434 కు చేరింది. అలాగే.. ఇప్ప‌టి వ‌ర‌కు దేశ వ్యాప్తంగా ఆరోగ్య శాఖ అందించిన‌.. క‌రోనా వ్యాక్సిన్ల సంఖ్య 132.9 కోట్ల కు చేరింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version