హైదరాబాద్ లోని టాలీవుడ్ పబ్ పై టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో తొమ్మిది మంది మహిళలు 33 మంది పురుషులు అరెస్ట్ అయ్యారు. పబ్ లో అసభ్యకరంగా డ్యాన్సులు చేస్తున్నందుకు మహిళలకు ఒక్కొక్కరికి వెయ్యి చెల్లిస్తున్నారని పోలీసులు ఆరోపించారు. అంతే కాకుండా పబ్ లో అసాంఘీక కార్యకలాపాలు జరుగుతున్నప్పుడు కూడా గుర్తించామని పోలీసులు వెల్లడించారు.
గతంలో లిబ్సన్ పబ్ పేరుతో ఇదే పబ్ ను నిర్వహించినట్టు ఆరోపణలు వస్తున్నాయి. గతంలోనూ అసాంఘీక కార్యకలాపాలు నిర్వహించడంతో దాడులు జరిపినట్టు సమాచారం. దాంతో పబ్ కు టాలీవుడ్ పబ్ అంటూ పేరు మార్చి మళ్లీ అలాంటి కార్యక్రమాలే చేపడుతున్నట్టు సమాచారం అందడంతో పోలీసులు దాడులు జరిపినట్టు తెలుస్తోంది. ఇక పబ్ నిర్వాహకులు వేణు గోపాల్, సాయి భరద్వాజ్, పబ్ మేనేజర్ రాము లపై కేసులు నమోదు చేశారు.