కరోనా నిర్వహణ విషయంలో అమెరికా, బ్రెజిల్ కంటే ఇండియా చాలా బెస్ట్ అని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. కరోనా వ్యాప్తిని మనం సమర్ధవంతంగా అడ్డుకున్నామని ఆయన నేడు సాయంత్రం జాతిని ఉద్దేశించి చేసిన ప్రసంగంలో పేర్కొన్నారు. కరోనా నుంచి ఇప్పుడే ఇండియా బయటకు వస్తున్నామని, ఇళ్ళ నుంచి కూడా ఇప్పుడిప్పుడే దేశం బయటకు వస్తుందని మోడీ తన ప్రసంగంలో తెలిపారు.
ఇండియా లో రికవరీ రేటు అమెరికా, బ్రెజిల్ కంటే చాలా బాగుందని మోడీ అన్నారు. మరణాల రేటు విషయంలో కూడా ఇండియా చాలా బాగా పని చేసింది అని ఆయన చెప్పుకొచ్చారు. కరోనాతో ప్రమాదం లేదని ఎవరూ భావించవద్దు అని ఆయన దేశ ప్రజలను హెచ్చరించారు. కరోనాతో ఇంకా పోరాటం చేయాల్సి ఉంది అని మోడీ చెప్పారు. ఇది పండుగల సీజన్ కాబట్టి మనం అందరం చాలా జాగ్రత్తగా ఉండాలని ఆయన అన్నారు.
ఇండియాలో 90 లక్షల కోవిడ్ పడకలు కాళీగా ఉన్నట్టు మోడీ వివరించారు. మాస్క్ లు లేకుండా తిరిగితే అనవసరంగా ఇబ్బందులు వస్తాయని అన్నారు. మాస్క్ లు లేకుండా చాలా మంది బయట తిరుగుతున్నారని ఆయన చెప్పారు.