ఎడతెరిపి లేకుండా చూస్తున్న వర్షం కారణంగా న్యూజిలాండ్ మరియు ఇండియా మధ్య ఈరోజు జరగాల్సిన మొదటి టీ20 మ్యాచ్ రద్దు అయింది. మ్యాచ్ జరగాల్సిన వెల్డింగ్టన్ లో ఉదయం నుంచి వర్షం పడుతూ ఉండటంతో టాస్ కూడా సాధ్యం కాలేదు.
దీంతో ఇప్పటివరకు వేచి చూసి ఇక వర్షం తగ్గేలా కనిపించకపోవడంతో మ్యాచ్ ను రద్దు చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. ఇక ఈనెల 20వ తేదీన రెండో టి20 మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ రద్దు తో ఫ్యాన్స్ తీవ్ర నిరాశకు గురయ్యారు.