కాన్పూర్‌లో భారత్, న్యూజిలాండ్ మధ్య జరిగిన తొలి టెస్టు మ్యాచ్ డ్రాగా ముగిసింది. నిర్ణీత ఓవర్లలో న్యూజిలాండ్ బ్యాట్స్‌మెన్‌ను టీమిండియా ఆలౌట్ చేయలేకపోయింది. 284 పరుగుల విజయ లక్ష్యంతో దిగిన కివీస్ తొమ్మిది వికెట్లు నష్టపోయిన 165 పరుగుల చేయడంతో తొలి టెస్టు మ్యాచ్ డ్రాగా ముగిసింది. గత నాలుగేండ్లలో స్వదేశీ గడ్డపై టీమిండియాకు తొలి టెస్టు డ్రా ఇదే కావడం గమనార్హం. తొలి ఇన్నింగ్స్‌లో 105 పరుగులు, రెండో ఇన్నింగ్స్‌లో 65 పరుగులు చేసిన శ్రేయస్ అయ్యర్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా ఎంపికయ్యారు.
2017, డిసెంబర్‌లో స్వదేశీ గడ్డపై భారత్, శ్రీలంక మధ్య జరిగిన టెస్టు మ్యాచ్ డ్రాగా ముగిసింది. అప్పటి నుంచి భారత్ డ్రా చేసుకోలేదు. దాదాపు నాలుగేండ్ల అనంతరం న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్ డ్రాగా ముగియడం గమనార్హం. అలాగే, ఆరు మ్యాచ్‌ల వరుస ఓటముల తర్వాత భారత్‌తో న్యూజిలాండ్ డ్రా చేసుకోవడం ఆ జట్టుకు ఊరటనిచ్చే అంశం .