తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం…. ఓమిక్రాన్ పై కేబినెట్ సబ్ కమిటీ …

-

కరోనా కొత్త వేరియంట్ ఓమిక్రాన్ ప్రపంచం గుండెల్లో రైళ్లను పరిగెత్తుస్తోంది. తాజాగా 15 పైగా దేశాలకు వ్యాపించింది. దీంతో ప్రపంచ దేశాలు అలెర్ట్ అయ్యాయి. ఓమిక్రాన్ ఎక్కడ ఎక్కువగా ఉందో ఆదేశాల నుంచి వచ్చే వారిపై ట్రావెల్ బ్యాన్ విధిస్తున్నాయి ప్రపంచ దేశాలు. తాజాగా ఇండియా కూడా ఓమిక్రాన్ పై అప్రమత్తం అయింది. రిస్క్ ఉన్న దేశాల నుంచి వచ్చే వారిపై నిఘా ఉంచాలని.. ఎయిర్ పోర్ట్ ల్లోనే ఆర్టీపీసీఆర్ టెస్టులు చేయాలని గైడ్ లైన్స్ కూడా జారీ చేసింది.

తాజాగా తెలంగాణ ప్రభుత్వం కూడా ఓమిక్రాన్ పై అలెర్ట్ అయింది. నేడే జరిగిన కేబినెట్ సమావేశంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా కోవిడ్ టీకాల పురోగతి, మందుల లభ్యత, ఆక్సీజన్ బెడ్స్ సామర్థ్యం, తదితర అంశాల పై తెలంగాణ కేబినెట్ సమీక్షించింది. తాజాగా ఓమిక్రాన్ పై కేబినెట్ సబ్ కమిటీని కూడా తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కమిటీకి అధ్యక్షుడిగా ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావును నియమించింది. ఇందులో సభ్యులుగా మంత్రులు కేటీఆర్, సబితా ఇంద్రారెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావులు ఉండనున్నారు. ఓమిక్రాన్ వస్తే తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి కేబినెట్ సబ్ కమిటీ సమీక్షిస్తుంది. అందుకు తగ్గ జాగ్రత్తలు తీసుకోనుంది. అత్యంత కీలకంగా తెలంగాణలో వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని వేగవంతం చేయడానికి కేబినెట్ సబ్ కమిటీ చర్యలు తీసుకోనుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version