ప్రధాని మోదీతో ఫోన్ లో మాట్లాడిన అమెరికా ఉపాధ్యక్షుడు

-

భారత్–పాకిస్థాన్ మధ్య సోమవారం జరగబోయే కాల్పుల విరమణ చర్చలకు ముందు కీలక పరిణామం చోటుచేసుకుంది. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ఫోన్‌ సంభాషణ జరిపారు. ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ సంభాషణ జరగడం రేపు జరిగే చర్చలకు ప్రాధాన్యతను మరింత పెంచింది. ఈ సందర్భంలో ప్రధాని మోదీ దేశ భద్రతపై భారత ప్రభుత్వ స్థైర్యాన్ని జేడీ వాన్స్‌కు స్పష్టంగా వివరించినట్లు తెలిసింది. పాకిస్థాన్ ఎలాంటి ఉద్ధటైన చర్యలు చేపడితే, భారతదేశం తగిన విధంగా స్పందిస్తుందని ఆయన స్పష్టం చేశారు. భారత సంయమనాన్ని బలహీనతగా అర్థం చేసుకోవద్దని, భద్రతా అంశాల్లో రాజీపడే ప్రసక్తే లేదని ప్రధాని మోదీ హితవు పలికారు. ఉగ్రవాదంపై భారత్ అసహనంగా ఉన్నదనీ, ఈ విషయంలో మినహాయింపులేదని ఆయన తేల్చిచెప్పారు.

కశ్మీర్ విషయంలో కూడా ప్రధాని మోదీ తన స్పష్టమైన స్థాయిని మళ్ళీ గుర్తు చేశారు. పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీఓకే) భారతదేశానికి అంతర్భాగమేనని, ఈ అంశంపై చర్చలకు అవసరం లేదని పరోక్షంగా అమెరికాకు సందేశమిచ్చారు. పీఓకే శాంతియుతంగా భారత్‌కు తిరిగి అప్పగించడమే పాకిస్థాన్‌కు ఏకైక మార్గమని ఆయన గతంలో చెప్పిన దృఢమైన ప్రకటనను మరోసారి పదిలం చేశారు. ఇక భారత్–పాక్ మధ్య ఉద్రిక్తతలు పెరిగిన తరుణంలో అమెరికా అధ్యక్షుడు తొలుత కాల్పుల విరమణ ఒప్పందాన్ని ప్రకటించగా, భారత ప్రభుత్వం కూడా స్పందించింది. అయినప్పటికీ, పాకిస్థాన్ నుంచి మరేదైనా దుశ్చర్య జరిగితే తిప్పికొట్టేందుకు భారత సైన్యం ‘ఆపరేషన్ సిందూర్’ను కొనసాగించనుందని స్పష్టం చేసింది. సరిహద్దుల్లో భద్రతను పటిష్టంగా కాపాడేందుకు భారత ప్రభుత్వం చురుగ్గా చర్యలు తీసుకుంటున్నట్లు సంకేతాలు పంపింది.

 

Read more RELATED
Recommended to you

Latest news