స్మిత్ మెరుపు సెంచరీ.. భారత్ టార్గెట్ 390

-

ఆస్ట్రేలియాతో మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా సిడ్నీ వేదికగా టీమిండియాతో జ‌రుగుతున్న రెండో వ‌న్డేలోనూ ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్ చెల‌రేగిపోయారు. మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ మెరుపు సెంచ‌రీకి తోడు ఓపెన‌ర్లు డేవిడ్ వార్న‌ర్‌ ఆరోన్ ఫించ్‌ హాఫ్ సెంచరీలు ఆఖర్లో మ్యాక్స్ వెల్ మెరుపులతో ఆస్ట్రేలియా నిర్ణీత 50 ఓవ‌ర్ల‌లో 4 వికెట్లకు 389 పరుగుల భారీ స్కోర్ సాధించింది.

ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్ ధాటికి టీమిండియా బౌల‌ర్లు మ‌రోసారి భారీగా ప‌రుగులు స‌మ‌ర్పించుకున్నారు. తొలి వన్డేను తలపించేలా ఈ మ్యాచ్‌లో ఆసీస్ బ్యాట్స్ మెన్ చెలరేగి ఆడారు. స్మిత్ వరుసగా రెండో మ్యాచ్‌లో సెంచరీ చేయగా.. వార్నర్, ఫించ్, లబుచానే, మ్యాక్స్‌వెల్ అర్ధ సెంచరీలతో మెరిపించారు. ఇక భారత బౌలర్లలో సైనీ, చాహల్ భారీగా పరుగులు సమర్పించడంతో మయాంక్ అగర్వాల్, హార్దిక్ పాండ్యలతో బౌలింగ్ చేయించాడు టీమిండియా కెప్టెన్ కోహ్లి. ఇదే గ్రౌండ్లో జరిగిన తొలి వన్డేలోనూ ముందు బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 374 పరుగుల భారీ స్కోర్ చేసింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version