తప్పు తనది… నింద భారత్ పై! కెనడా వింత ప్రవర్తన?

-

భారత్- కెనడా మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఒక ఉగ్రవాది హత్యను భారత్ కు ముడిపెట్టి కెనడా ప్రధాని జస్టిస్ ట్రుడో నిరాధార ఆరోపణలు చేస్తున్నారు. ప్రధాని మాటలకు విదేశాంగ మంత్రి కూడా వత్తాసు పలుకుతున్నాడు.  మాటలతో ఆగకుండా కెనడా ప్రధాని కెనడాలోని భారత దౌత్య వేత్త పై బహిష్కరణ వేటు వేశార . వారి ఆరోపణలను, చర్యలను భారత్ ఖండించింది. భారత్ లోని కెనడా దౌత్య వేత్త పై బహిష్కరణ వేటు వేసి కెనడాకు గట్టి సమాధానం ఇచ్చింది భారత్.

అసలు ఈ గొడవకు కారణం భారత్ నిషేధింపబడిన ఖలిస్తాన్ ఉగ్రవాది హరదీప్ సింగ్ నిజ్జర్ హత్య. ఆ హత్య భారత్ లో జరగలేదు, భారతే చేయించింది అని ఆధారాలు కూడా కెనడా దగ్గర లేవు. కానీ కెనడా ప్రధాని ట్రుడో ఖలిస్తాన్ ఉద్యమకారుల వల్ల లాభం పొందే వారి చేతిలో కీలుబొమ్మగా మారి ఇలా భారత్ పై ఆరోపణలు చేస్తున్నాడని ప్రపంచ దేశాలు విమర్శిస్తున్నాయి.

కెనడాలో జరిగే హింసాత్మక పరిణామాలకు భారత్ కు సంబంధం లేదని ప్రపంచ దేశాలు అంటున్నాయి. రాజకీయ లబ్ధి కోసం ట్రూడో ఇలాంటి ప్రకటనలు చేసైనా, నాయకుడి లక్షణం ఇది కాదు అని ప్రపంచ దేశాలు విమర్శిస్తున్నాయి. చట్టవిరుద్ధ కార్యకలాపాలైన హత్యలు, మానవ అక్రమా రవాణా, ఉగ్రవాదులకు చోటు ఇవ్వడం ఇలాంటివన్నీ కెనడా ఎప్పటినుండో యదేచ్చగా చేస్తుందనే ఆరోపణలు ఉన్నాయి.  వాటి వల్ల ఆ దేశానికి కలిగే నష్టాన్ని, దేశంలో కలిగే హింసాత్మక పరిస్థితులకు భారత్ ను బాధ్యులను చేయాలని చూస్తోంది. ఇలా చేయడం సరికాదని భారత్ గట్టిగా సమాధానమిచ్చింది.

కెనడా ప్రవర్తనను మార్చుకోకుంటే రాబోయే రోజుల్లో  భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని ప్రపంచ దేశాలు హెచ్చరిస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version