బ్రాహ్మణిపైనే భారం..తమ్ముళ్ళ ఆలోచన ఇదే.!

-

చంద్రబాబు నాయుడు అరెస్టు తర్వాత టిడిపికి నాయకుడు ఎవరు అనే చర్చ సర్వత్రా ఉత్కంఠ రేపుతుంది. ఇప్పటికే ఆయన రిమాండ్ కోర్టు పొడిగించింది. అటు సి‌ఐ‌డి కస్టడీకి ఇచ్చారు. ఇటు లోకేష్ కు కూడా స్కిల్ డెవలప్మెంట్ స్కాంలో భాగస్వామ్యం ఉందని, అరెస్టు చేసే అవకాశాలు ఉన్నాయని అధికార పార్టీ నేతలు ప్రచారం చేస్తున్నారు. లోకేష్ కూడా అరెస్ట్ అయితే టిడిపికి ఎవరు నాయకత్వం వహిస్తారు అనే ప్రశ్న టిడిపి క్యాడర్ ను వేధిస్తోంది.

ఈ ప్రశ్నకు సమాధానంగా చంద్రబాబు తర్వాత ఆ స్థానాన్ని బ్రాహ్మణి భర్తీ చేస్తారని ఇటీవల అయ్యన్నపాత్రుడు ప్రకటించారు. టిడిపికి సంక్షోభాలు కొత్త కాదని అయ్యన్నపాత్రుడు అన్నారు. రాజకీయాలకు దూరంగా ఉన్న బ్రాహ్మణి ఇప్పుడు పార్టీ బాధ్యతలు దిగ్విజయంగా నిర్వహించగలదా, లేదా అని టిడిపి నాయకులు ఆలోచిస్తున్నారు. బ్రాహ్మణిని ముందు పెట్టి టిడిపిని నడిపిస్తామని సీనియర్ నాయకులు అంటున్నారు.

అయితే ఇప్పుడు జరుగుతున్న పరిణామాలని బట్టి చూస్తే పార్టీకి బ్రాహ్మణి అవసరం ఎక్కువ కనిపిస్తుంది. ఆమె ముందుండి పార్టీని నడిపిస్తే బెటర్ అని అంతా భావిస్తున్నారు. ఈ లోపు కేడర్ కూడా ధైర్యంగా ఉంటుందని అనుకుంటున్నారు. ఇప్పటికే పార్టీ కార్యక్రమాలు ఎక్కడకక్కడ ఆగిపోయాయి. ఈ నేపథ్యంలో బ్రాహ్మణి ముందుకు రావాలని కోరుకుంటున్నారు. అయితే బ్రాహ్మణి తాత, తండ్రి రాజకీయ వారసత్వాన్ని పుణికి పుచ్చుకొని రాజకీయాల్లో రాణించగలదా!! మేనత్త పురందరేశ్వరిలా చక్రం తిప్పగలదా లేదా అని రాజకీయ వర్గాలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు . సీనియర్ల సలహాతో బ్రాహ్మణి టిడిపిని నడిపించగలదా??  అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version