వన్ డే వరల్డ్ కప్ 2023 కి ముందు అన్ని జట్లు రెండు వార్మ్ అప్ మ్యాచ్ లు ఆడదానికి ఐసీసీ షెడ్యూల్ చేసిన సంగతి తెలిసిందే. అందులో భాగంగా ఇండియా ఆడనున్న రెండు మ్యాచ్ లలో ఇంగ్లాండ్ తో మరియు నెథర్లాండ్ తో జరగాల్సి ఉండగా రెండు మ్యాచ్ లు కూడా వర్షం కారణంగా కనీసం బంతి కూడా పడకుండానే రద్దు కావడం జరిగింది. మొదటి మ్యాచ్ తిరువనంతపురం వేదికగా ఇంగ్లాండ్ తో జరగాల్సి ఉండగా… టాస్ పడిన అనంతరం నిరవధికంగా వర్షం పడడంతో మ్యాచ్ కనీసం ఒక్క బంతి కూడా పడకపోవడంతో అంపైర్లు మ్యాచ్ ను రద్దు చేయడం జరిగింది. ఇక ఇండియా ఆడనున్న రెండవ మ్యాచ్ లో నెథర్లాండ్ మరియు ఇండియా ఆడాల్సి ఉండగా, ఈ రోజు దురదృష్టవశాత్తూ మ్యాచ్ కూడా తిరువనంతపురం లోనే జరగడం ఇక వర్షం ఎడతెరిపి లేకుండా పడడంతో మ్యాచ్ టాస్ కూడా పడకుండానే రద్దు అయినట్లుగా అంపైర్లు ప్రకటించారు.
దీనితో వరల్డ్ కప్ కు ముందు ఇండియా కనీసం ఒక్క బంతి కూడా ఆడకుండానే డైరెక్ట్ గా మ్యాచ్ లను ఆడనుంది.