ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బర్డ్ ఫ్లూ వ్యాధి కలకలం రేపుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో… ఏపీలో వేలాది కోళ్లు మరణిస్తున్నాయి. దీంతో చికెన్ తినకూడదని ఏపీ అధికారులు కూడా ఆదేశాలు స్పష్టంగా ఇచ్చారు. దీంతో చికెన్ రేట్లు అమాంతం పడిపోయాయి. కిలో చికెన్ 200 నుంచి 220 రూపాయలు ఉండేది. కానీ ఇప్పుడు 150 రూపాయలకు కిలో చికెన్ అమ్ముతున్నారు.
అయినా కూడా ఎవరు కొనే పరిస్థితిలో లేదు. దాదాపు 50 రూపాయల డిస్కౌంట్ ఇస్తూ… చికెన్ ను బంపర్ ఆఫర్లు అమ్ముతున్నారు. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కోళ్లు విపరీతంగా మరణించిన నేపథ్యంలో… తెలంగాణ ప్రభుత్వం కూడా అలర్ట్ అయింది. తెలంగాణ ప్రజలు కూడా కొన్ని రోజులపాటు చికెన్ తినకూడదని ఆదేశాలు ఇచ్చింది. అలాగే ఏపీ నుంచి వచ్చే కోళ్ల పై నిషేధం విధించింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం.