హైదరాబాద్ మహానగరంలో అర్ధరాత్రి ఓ ఫాంహౌస్‌లో కోడి పందేలు, క్యాసినో నిర్వహిస్తున్నట్లు సమాచారం రావడంతో పోలీసులు దాడులు జరిపారు. మంగళవారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకోగా ఇందులో పాల్గొన్న 64 మందిని పోలీసులు పట్టుకున్నారు.
ఈ సోదాల్లో భాగంగా క్యాసినో ఆడుతున్న వ్యక్తులు.. రూ. 30 లక్షల నగదు, 55 లగ్జరీ కార్లను సీజ్ చేశారు. అంతేకాకుండా 86 పందెం కోళ్ళు, బెట్టింగ్ కాయిన్స్, పందెం కోళ్లకు ఉపయోగించే 46 కోడి కత్తులను కూడా స్వాధీనం చేసుకున్నట్లు రాజేంద్రనగర్ డీసీపీ, అధికారులు వెల్లడించారు. దొంగచాటుగా ఈ వ్యవహారాన్ని ఓ రాజకీయ పార్టీకి చెందిన నేత నిర్వహించినట్లు తెలుస్తోంది. కాగా, దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.