ఐసీసీ టీ20 ప్రపంచకప్ నిష్క్రమణ తర్వాత టీమ్‌ఇండియా న్యూజిలాండ్‌లో పర్యటిస్తోంది. మూడు టీ20లు, మూడు వన్డేలు ఆడాల్సి ఉంది. అయితే.. భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య రెండో టీ20 మ్యాచ్‌కు రంగం సిద్ధమైంది. ఆదివారం మౌంట్ మౌంగనుయ్‌లోని బే ఓవల్ మైదానంలో మరికొన్ని గంటల్లో మ్యాచ్ మొదలవ్వనుంది. సీనియర్లకు విశ్రాంతినిచ్చిన యాజమాన్యం ఈ సిరీసుకు పూర్తిగా కుర్రాళ్లనే పంపించింది. దాంతో వారెలా ఆడతారో చూడాలని అభిమానులు ఆసక్తితో ఉన్నారు. అయితే వారి నిరీక్షణ ఇంకా కొనసాగుతూనే ఉంది. అయితే మొదటి టీ20 కి అడ్డుపడిన వరుణుడు రెండో మ్యాచును కూడా వదిలేలా లేదని అనిపిస్తుంది.
నవంబర్ 18న వెల్లింగ్టన్ వేదికగా భారత్- కివీస్ తొలి టీ20 జరగాలి. అయితే వర్షం కారణంగా ఆ మ్యాచ్ రద్దయింది. నేడు రెండో టీ20 కు ఇరు జట్లు సన్నద్ధమయ్యాయి. అయితే ఈ మ్యాచ్ జరిగే మౌంట్ మాంగనుయ్ లోనూ వర్షం పడే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ఆదివారం మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు భారీ జల్లులు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ సమాచారం. ఈ క్రమంలో ఈ మ్యాచ్ జరిగేది కూడా అనుమానంగానే ఉంది. రెండో టీ20 కోసం ఇప్పటికే భారత జట్టు మౌంట్ మాంగనూయ్ లో అడుగు పెట్టింది.
హార్దిక్ పాండ్య నేతృత్వంలోని భారత జట్టు బలంగానే ఉంది. రిషభ్ పంత్, శ్రేయస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, శుభ్ మన్ గిల్, సంజూ శాంసన్, దీపక్ హుడా, ఇషాన్ కిషన్ లాంటి ఆటగాళ్లతో మెరుగ్గా కనిపిస్తోంది. ఇషాన్ కిషన్‌ను ఓపెనర్‌గా బరిలోకి దించే అవకాశముంది. ఇషాన్ గత కొంతకాలంగా మంచి ఫామ్‌లో ఉన్నాడు.
భారత్ జట్టు
ఇషాన్ కిషన్, శుభమన్ గిల్, శ్రేయస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, రిషభ్ పంత్, సంజూ శాంసన్, హార్దిక్ పాండ్య, యుజేంద్ర
చాహల్,భువనేశ్వర్ కుమార్, అర్ష్‌దీప్ సింగ్, ఉమ్రాన్ మాలిక్.
న్యూజిలాండ్ జట్టు
ఫిన్ అలెన్, డెవాన్ కాన్వే, కేన్ విలియమ్సన్, గ్లెన్ ఫిలిప్స్, డారిల్ మిచెల్, జేమ్స్ నీషమ్, మిచెల్ సాంట్నర్, టిమ్ సౌథీ, ఆడమ్ మిల్నే, లాకీ ఫెర్గూసన్, బ్లెయిర్ టిక్నర్.