కానిస్టేబుల్ కు సీమంతం చేసిన హోం మంత్రి అనిత..!

-

కానిస్టేబుల్ కు సీమంతం చేశారు హోం మంత్రి అనిత. మహిళా దినోత్సవం రోజు కానిస్టేబుల్ కు సీమంతం చేశారు హోం మంత్రి అనిత. విశాఖ ఎంవీపీ కాలనీ పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్ గా పనిచేస్తున్న రేవతి అనే మహిళకు సీమంతం చేశారు హోం మంత్రి వంగలపూడి అనిత.

Home Minister salutes constable on Women’s Day

గతంలో అనిత గృహ నిర్బంధానికి వెళ్లింది రేవతి. ఇప్పుడు ఓ సోదరిలా తనకు సీమంతం చేసిన అనితను చూసి భావోద్వేగానికి గురయ్యారు రేవతి. ఇక కానిస్టేబుల్ కు హోం మంత్రి అనిత సీమంతం చేసిన వీడియో వైరల్‌ గా మారింది.

ఈ సందర్భంగా అనిత మాట్లాడారు. ఆడపిల్లవి జాగ్రత్త అనే చెప్పే బదులు మగపిల్లాడికి జాగ్రత్తలు చెప్పి బయటకు పంపే రోజులు రావాలని కోరారు. దివంగత నందమూరి తారక రామారావు, సీఎం చంద్రబాబు పాలనలో మహిళా సాధికారత, వికాసం, ఆర్థిక అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వడం జరిగిందన్నారు. మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని ముఖ్యంగా అందరికీ ఉపాధి కల్పించే విధంగా మహిళలు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని సీఎం చంద్రబాబు కృషి చేస్తున్నట్టు తెలిపారు హోం మంత్రి అనిత.

Read more RELATED
Recommended to you

Latest news