కంగారూలను కంగారు పెట్టిస్తున్న టీమిండియా.. వన్డే సిరీస్ కూడా మనదే

-

అవును.. ఆస్ట్రేలియా వాళ్లను కంగారూలు అంటారు కదా. ఆ కంగారూలను టీమిండియా కంగారు పెట్టించింది. వాళ్లకు చుక్కలు చూపించి వరుసగా టెస్టు సిరీస్, వన్డే సిరీస్‌ను తమ ఖాతాలో వేసుకున్నది. రెండూ చరిత్ర సృష్టించిన సిరీస్‌లే. ఆస్ట్రేలియాతో జరిగిన చివరి వన్డేలో భారత్ 7 వికెట్ల తేడాతో గెలిచి మరో చరిత్రను లిఖించింది. 231 పరుగుల లక్ష్యాన్ని 4 బంతులు మిగిలి ఉండగానే మూడు వికెట్ల నష్టంతో ఆస్ట్రేలియాపై గెలిచింది భారత్.

భారత ఆటగాళ్లలో ఎంఎస్ ధోనీ 87 పరుగులు చేయగా.. కేదార్ జాదవ్ 61, కోహ్లీ 46, శిఖర్ ధావన్ 23 పరుగులు చేసి జట్టు గెలుపులో కీలక పాత్ర పోషించారు. ఇక.. ఆరు వికెట్లు తీసి ఆస్ట్రేలియా పరుగులను కట్టడి చేసిన స్పిన్నర్ చాహల్‌కు మ్యాన్‌ ఆఫ్ ది మ్యాచ్ దక్కింది. మరోవైపు మూడు మ్యాచుల్లోనూ హాఫ్ సెంచరీలు బాదిన ధోనీకి ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ వరించింది. సిడ్నీ వన్డేలో 51 పరుగులు, అడిలైడ్ వన్డేలో 55(నాటౌట్), ఇవాళ మెల్‌బోర్న్‌లో జరిగిన చివరి వన్డేలో 87(నాటౌట్) పరుగులను ధోని చేశాడు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version