Indian 2: మ‌ళ్లీ సెట్ మీద‌కి వెళ్ల‌నున్న “ఇండియ‌న్ 2”!

-

Indian 2: యూనివర్సల్ హీరో కమల్ హాసన్ కెరీర్‌లో సూప‌ర్ , బ్లాక్ బాస్ట‌ర్ హిట్లో చిత్రాల్లో ఒకటి భార‌తీయుడు. ఈ సినిమా 1996లో కమ‌ల్ హీరోగా శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కించారు. ఆ సినిమా విడుదల అయిన దాదాపు పాతికేళ్ళ తర్వాత తాజాగా కమల్ హాసన్ మరియు శంకర్ కలిసి “భారతీయుడు-2” సినిమా ప్లాన్ చేశారు. ఈ చిత్రాన్ని నిర్మించ‌డానికి లైకా ప్రొడక్షన్స్‌, శంకర్ ల మ‌ధ్య ఒప్పందం కుదిరింది.

మొదట్లో అంతా బాగానే ఉన్నప్పటికీ తరువాత బడ్జెట్ విషయంలో నిర్మాతలకు శంకర్ కి మధ్య గొడవలు జరిగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వారు శంకర్ మీద కేసు కూడా పెట్టారు. చాలాకాలంపాటు కోర్టులో నలిగిన ఈ కేసు నుండి శంకర్ ఈ మధ్యనే బయటపడ్డారు

అయితే ఇప్పుడు శంకర్‌, చిత్ర నిర్మాణ సంస్థ మధ్య చర్చలు స‌ఫ‌లం కాడంతో మ‌ళ్లీఈ మూవీని సెట్స్ పైకి తీసుకెళ్లే ఆలోచ‌న చేస్తున్నార‌ట‌. ఇప్ప‌టికే ఈ చిత్రం స‌గం షూటింగ్ ను పూర్తి చేసుకుంది. మిగితా భాగాన్ని అతి త్వ‌రలోనే ముగించాల‌ని చిత్ర‌బృందం భావిస్తుంద‌ట‌.
ఇదిలాఉంటే.. శంక‌ర్..ఓ వైపు రామ్ చ‌రణ్‌తో ఒక ప్రాజెక్ట్, మ‌రో వైపు ర‌ణ్‌వీర్ సింగ్‌తో మ‌రో ప్రాజెక్ట్ చేస్తున్నారు. మ‌రికొద్ది రోజుల్లో ఈ సినిమాపై కార్ల‌టీ రానున్న‌ది. ఇండియ‌న్ 2లో క‌మ‌ల్ హాస‌న్ స‌ర‌స‌న కాజ‌ల్ అగ‌ర్వాల్ క‌థానాయిక‌గా న‌టిస్తున్న విష‌యం తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Exit mobile version