14 ఏండ్ల ముఖ్యమంత్రివా లేక వీది రౌడివా? : చంద్రబాబుపై రోజా ఫైర్

-

14 ఏండ్ల ముఖ్యమంత్రివా లేక వీది రౌడివా? అంటూ చంద్రబాబుపై నగరి ఎమ్మెల్యే రోజా ఫైర్ అయ్యారు. ముందు “యధా రాజా తథా ప్రజా” అంటారని… అయితే ఇప్పుడు యథా రాజా తథా చంద్రబాబు అన్నది తెలుగు దేశం పార్టీకి, చంద్రబాబుకే సరి పోతుందని చురకలు అంటించారు. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి గా పనిచేసిన చంద్రబాబు, అతనిని నమ్మి ఓటేసిన కుప్పం నియోజకవర్గ ప్రజలకు హంద్రీ – నీవా ప్రాజెక్ట్ ద్వారా నీళ్ళు కూడా ఇవ్వకుండా చేసి ఈ రోజు జగన్ మోహన్ రెడ్డి నీరు ఇవ్వలేదని విమర్శించడం ఎక్కడి న్యామమన్నారని ఫైర్‌ అయ్యారు.

కుప్పంలో కనీసం ఇళ్లు, కార్యాలయం కూడా ఏర్పాటు చేసుకోకుండా కుప్పం నియోజకవర్గ ప్రజల అభివృద్ధి, సంక్షేమాిలను గాలికి వదిలేసి ఈ రోజు కుప్పం ప్రజలని ఓట్లు వేయమని అడగడం హాస్యాస్పదమని నిప్పులు చెరిగారు. సిగ్గు లేకుండా కుప్పానికి రండి తేల్చుకుందామని పిలుస్తున్నారని… కుప్పం నుంచి శ్రీకాకుళం వరకు టీడీపీకి డిపాజిట్లు గల్లంతైంది అనే విషయాన్ని గుర్తు చేసుకోవాలని ఎద్దేవా చేసారు రోజా. చంద్రబాబు క్యాడర్ మొత్తం చేజారి పోతుందన్న భయంతో దిగజారుడు రాజకీయాలకు పాల్పడితే చరిత్ర హీనుడు గా మిగిలి పోతాడని హెచ్చరించారు రోజా.

Read more RELATED
Recommended to you

Exit mobile version