ఇంటి నుంచే పనిచేయనున్న భారత సైన్యం…కరోనా ప్రభావమే!

-

కరోనా వైరస్ దేశవ్యాప్తంగా ప్రబలకుండా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్న విషయం తెలిసిందే. అయితే ఈ మహమ్మారిని కట్టడి చేసేందుకు ప్రతి ఒక్కరికీ కూడా ఇంటి నుంచే పనిచేయాలి అంటూ కేంద్రం సూచించడం తో ఇప్పుడు భారత సైన్యం సైతం ఇంటి నుంచే పని చేయాల్సి వస్తుంది. ఢిల్లీ లోని సైనిక ప్రధాన కార్యాలయంలో 35-50 శాతం మంది అధికారులకు విడతల వారీగా ఇంటి నుంచే పనిచేయాలని ఆర్మీ శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది. మార్చి 23న తొలి బృందం, మార్చి 30న రెండో బృందం క్వారంటైన్‌ అవుతుంది. ప్రధాన కార్యాలయంలో పనిచేసే అధికారుల్లో 35 శాతం మంది, జూనియర్‌ కమిషన్డ్‌ అధికారుల్లో (జేసీఓ) 50 శాతం మంది ఇంటి నుంచే పనిచేస్తారు. మార్చి 23, 2020న మొదటి బృందం వారం రోజులు క్వారంటైన్‌ అవుతుంది. రెండో బృందం మార్చి 30, 2020న నిర్బంధం పాటిస్తుంది. ఒక బృందంతో మరో బృందం కలవడాన్ని నిషేధించాం. అత్యవసర సమయాల్లో టెలిఫోన్‌, ఎలక్ట్రానిక్‌ మాధ్యమాల ద్వారా పని చేసేందుకు అన్ని వేళలా వీరు అందుబాటులో ఉండాలి అని అంటూ అధికారులు తెలిపారు. కోవిడ్-19 ఒకరి నుంచి మరొకరికి ఈజీ గా వ్యాపిస్తుంది అన్న నేపధ్యంలో కేంద్రం ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. అంతేకాకుండా ఇటీవల ప్రధాని మోడీ కూడా రెండు వారాల పాటు మీ సమయాన్ని మాకు ఇవ్వండి అంటూ జనతా కర్ఫ్యూ కి పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సైన్యం కూడా ఇలా షిఫ్ట్ లు వారీగా తమ సేవలను అందించనున్నారు.

ఒకేసారి రాకుండా, ప్రవేశ ద్వారాల వద్ద గుమిగూడకుండా, హాజరు వేసేందుకు ప్రధాన కార్యాలయంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఇందులో భాగంగా పని వేళలను 09:00-17:30, 09:45- 18:15 గంటలుగా మార్చారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఇంటి నుంచే పనిచేసేందుకు ఇంతకుముందే మోదీ సర్కార్‌ ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. ప్రైవేటు రంగంలోనూ సాధ్యమైనంత మేరకు ఉద్యోగులను ఇంటి నుంచే పనిచేసే విధంగా ఏర్పాట్లు చేయాలని సూచించారు కూడా. ఈ నేపథ్యంలోనే పలు ప్రయివేట్ కంపెని లు ఉద్యోగులకు ఇలాంటి అవకాశాన్ని అందిస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version