Viswanadhan Anand: ప్రస్తుతం సీని ఇండస్ట్రీలో బయోపిక్ ట్రెండ్ నడుస్తుంది. స్ఫూర్తిదాయక ప్రముఖులు, రాజకీయ నేతలు, స్వాతంత్ర యోధులు, క్రీడాకారులు, ఆర్మీ సైనికుల జీవితాలకు వెండితెర రూపమిచ్చేందుకు దర్శక, నిర్మాతలు ఆసక్తి కనబరుస్తున్నారు. ఇప్పటికే అనేక నిజ జీవిత కథా చిత్రాలు నిర్మితం అయ్యాయి. ఇప్పటివరకు వచ్చిన దాదాపు అన్ని బయోపిక్స్ బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల వర్షం కురిపించినవే.
ఇందులో సోర్ట్స్ పర్సన్స్ బయోపిక్ అంటే.. మరింత క్రేజ్. ఇప్పటికే ధోని, సచిన్, సైనా నెహ్వాల్ జీవితం ఆధారంగా సినిమాలు తెరకెక్కాయి. వీటికి ఎలాంటి ఆదరణ వచ్చిందో అందరికి తెలుసు. త్వరలో కపిల్ దేవ్ సినిమా కూడా రానుంది. ఆ చిత్రంలో రణ్ వీర్ సింగ్ హీరోగా నటిస్తున్నారు.
ఈ తరుణంలో మరో గ్రేట్ పర్సన్ లైఫ్ స్టోరీ తెరకెక్కబోతోంది. ఆయన ఎవరో కాదు. ఐదుసార్లు వరల్డ్ చెస్ ఛాంపియన్‌గా నిలిచిన విశ్వనాథన్ ఆనంద్ బయోపిక్ జీవితాన్ని తెరకెక్కించాలని ప్రయత్ని స్తున్నారు. గత కొద్ది రోజులుగా ఆయన మీద మూవీని రూపొందించేందుకు ప్రముఖ దర్శకుడు ఆనంద్ ఎల్ రాయ్ సన్నాహాలు చేస్తున్నారు. ఈ విషయాన్ని ఆనందే చేయడం విశేషం.
తాజాగా ఆయన ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఈ సినిమా ప్రస్తావన తీసుకోచ్చారు. ‘నా బయోపిక్ తీయడానికి నేను పర్మిషన్ ఇచ్చాను. ఆల్రెడీ స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది. నిజానికి ఇది ఎప్పుడో జరగాల్సి ఉంది. కరోనా వల్ల లేటయ్యింది’ అని చెప్పారాయన.
అయితే.. ఈ సినిమాలో తన పాత్రలో ఏ హీరోను చూడాలనుకుంటున్నారని ప్రశ్నించగా.. ఆనంద్ ఇంట్రెస్టింగ్ అన్సర్ ఇచ్చారు. నా పాత్రను ఎవరు పోషిస్తారో నేను చెప్పలేను కానీ.. నా పాత్రలోఅమీర్ ఖాన్ నటిస్తే బాగుంటుంది. ఆయనకు నాకు దగ్గరి పోలికలు ఉన్నాయి అని చెప్పుకొచ్చారు.
ఈ క్రమంలో మరీ రాజకీయాల్లోకి వస్తున్నారా ? అని ప్రశ్నించగా.. రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన లేదని, ఎప్పటికీ చెస్ ఆడుతూ ఉండాలనుకుంటున్ననీ తెలిపారు.
అయితే అమీర్ ఖాన్ ఈ పాత్రను ఒప్పుకుంటాడా? చర్చనీయంగా మారింది. ఆల్రెడీ సూపర్ హిట్ స్పోర్ట్స్ డ్రామా ‘దంగల్’లో రియల్ లైఫ్ రోల్‌లో అదరగొట్టాడు ఆమిర్. తను నటిస్తే విశ్వనాథన్ ఆనంద్ బయోపిక్ కూడా వేరే లెవెల్‌కి వెళ్తుంది. అయితే ప్రస్తుతం ‘లాల్ సింగ్ ఛద్దా’తో నటిస్తున్న విషయం తెలిసిందే.