వైరల్ వీడియో : త్రివర్ణ జలపాతం.. ఇది కదా అసలైన దేశభక్తి అంటే..!

-

దేశభక్తిని చాటే ఓ జలపాతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ‘సమ్యాక్‌స్పీక్స్’ అనే యూజర్ ఈ వీడియోను ట్విట్టర్‌లో పెట్టారు. ఈ వీడియోలో మన జాతీయ జెండాలోని మూడు రంగులను అద్దుకున్న జలం పైనుంచి దూకుతూ చూసే వారికి ఒక మధురమైన అనుభూతి కలిగిస్తుంది. ఎంతగానో ఆకట్టుకుంటున్న ఈ వీడియో స్వాతంత్ర్య దినోత్సవం రోజే వైరల్‌ అయ్యింది.

ఈ వీడియోను బాలీవుడ్ ప్రసిద్ధ ఛాయాచిత్రకారుడు భయానీ కూడా తన ఇన్‌స్టా‌లో పంచుకున్నారు. ఈ వీడియో చూసిన ప్రతిఒక్కరూ గర్వ పడేలా ఉంది. త్రివర్ణ పతాకంలా కనిపించేందుకు నీటి ప్రవాహానికి పైపుల ద్వారా రంగులనద్దారని తెలుస్తుంది. దీన్ని చూసిన నెటిజన్లు గర్వంతో జైహింద్‌ అంటూ రీట్వీట్‌ చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version