వాట్సాప్‌కు పోటీగా సందేశ్ యాప్.. లాంచ్ చేసిన భార‌త ప్ర‌భుత్వం..

-

ప్ర‌ముఖ ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్‌కు పోటీగా భార‌త ప్ర‌భుత్వ సందేశ్ పేరిట ఓ నూత‌న యాప్‌ను లాంచ్ చేసింది. వాట్సాప్‌లో ఉన్న ఫీచ‌ర్ల‌తోపాటు ఇంకొన్ని ఫీచ‌ర్ల‌ను అద‌నంగా ఈ యాప్‌లో అందిస్తున్నారు. ఈ యాప్‌ను నేష‌న‌ల్ ఇన్ఫ‌ర్మేటిక్స్ సెంట‌ర్ తాజాగా ఆవిష్క‌రించింది.

సందేశ్ యాప్‌లో యూజర్ల డేటాకు పూర్తి ర‌క్ష‌ణ ఉంటుంది. ఎందుకంటే ఈ యాప్ మేడిన్ ఇండియా క‌నుక ఇందులో స్టోర్ అయ్యే డేటా అంతా ఇండియాలోనే ఉంటుంది. క‌నుక యూజ‌ర్ల డేటాకు భ‌ద్ర‌త ల‌భిస్తుంది. అలాగే సందేశ్ యాప్‌లో బ‌ర్త్ డే, ప్రొఫెష‌న‌ల్ వివ‌రాల‌ను ఎంట‌ర్ చేయ‌వ‌చ్చు. కానీ వాట్సాప్ లో అందుకు అవ‌కాశం లేదు. ఇక ఫోన్ నంబ‌ర్ లేకుండా వాట్సాప్‌ను వాడ‌లేం. కానీ సందేశ్ యాప్‌ను వాడ‌వ‌చ్చు. కేవ‌లం ఈ-మెయిల్ ఉన్నా చాలు, ఈ యాప్‌ను వాడుకోవ‌చ్చు. అలాగే ఒక‌టిక‌న్నా ఎక్కువ డివైస్‌ల‌లో సందేశ్ యాప్‌ను ఉప‌యోగించ‌వ‌చ్చు. కానీ వాట్సాప్‌కు అందుకు అవ‌కాశం లేదు.

ఇక వాట్సాప్‌లో ఉన్న బ్రాడ్ క్యాస్ట్ మెసేజెస్‌, గ్రూప్స్, ఇమేజ్‌ల షేరింగ్‌, వీడియో, ఎమోజీలు వంటి ఫీచ‌ర్ల‌న్నీ సందేశ్ యాప్‌లోనూ ల‌భిస్తున్నాయి. అలాగే చాట్ బాట్, లాగౌట్ ఫీచ‌ర్ల‌ను కూడా సందేశ్ యాప్ లో అందిస్తున్నారు. ఇవి వాట్సాప్‌లో అందుబాటులో లేవు. అందువ‌ల్ల సందేశ్ యాప్ వాట్సాప్‌కు పోటీ ఇస్తుంద‌ని నిపుణులు భావిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version