సింగిల్‌ సినిమాతోనే స్టార్డమ్‌ తెచ్చుకుంటోన్న దర్శకులు

-

హిట్‌ వస్తే హీరో క్రెడిట్, ఫ్లాప్ అయితే దర్శకుడి వల్లే సినిమా పోయిందని కామెంట్ చెయ్యడం ఇండస్ట్రీలో చాలా కామన్. ఇలాంటి పరిస్థితుల్లో డైరెక్టర్లు ఫస్ట్ మూవీతోనే ఇండస్ట్రీని మెప్పించడం అంత ఈజీ కాదు. కానీ కొంతమంది దర్శకులు మాత్రం డెబ్యూతోనే స్టార్డమ్ తెచ్చుకున్నారు. భారీ అవకాశాలు అందుకుంటున్నారు.

టాలీవుడ్‌లో టాక్‌ ఆఫ్‌ ది టౌన్‌గా మారిన సినిమా ‘ఉప్పెన’. చిన్న సినిమాగా మొదలై, మూడు రోజుల్లోనే 30 కోట్ల వరకు కలెక్ట్ చేసి, ట్రేడ్‌ పండిట్స్‌ని ఆశ్చర్యపరుస్తోంది. డెబ్యూలోనే బుచ్చిబాబు అదరగొట్టాడనే ప్రశంషలు వస్తున్నాయి. అలాగే భారీ అవకాశాలు కూడా అందుకుంటున్నాడు బుచ్చిబాబు. నెక్ట్స్‌ రెండు సినిమాలు కూడా మైత్రీ మూవీ మేకర్స్‌లోనే తియ్యబోతున్నాడు.

‘అర్జున్‌ రెడ్డి’ సినిమాతో టాలీవుడ్‌లో సంచలనం సృష్టించిన దర్శకుడు సందీప్‌ వంగ. ఫస్ట్ మూవీతోనే పాథ్‌ బ్రేకింగ్‌ డైరెక్టర్‌ అనే ప్రశంషలు కూడా తెచ్చుకున్నాడు. ఈ ఇమేజ్‌తోనే బాలీవుడ్‌ బడా బ్యానర్ టీ-సీరీస్‌లో బ్యాక్‌ టు బ్యాక్ మూవీస్ చేస్తున్నాడు సందీప్‌ వంగ. ‘కభీర్‌ సింగ్’తో షాహిద్‌ కపూర్‌ని బిలియన్‌ క్లబ్‌లో చేర్చిన సందీప్, ఇప్పుడు టీ-సీరీస్‌లోనే రణ్‌బీర్ కపూర్‌తో ‘యానిమల్’ తీస్తున్నాడు.

ఫస్ట్ మూవీతోనే నేషనల్ అవార్డ్‌ అందుకున్న దర్శకుడు తరుణ్ భాస్కర్. ‘పెళ్లిచూపులు’తో మెగాఫోన్ పట్టిన తరుణ్‌భాస్కర్‌కి ఈ మూవీతో సూపర్‌ క్రేజ్ వచ్చింది. ఈ ఇమేజ్‌తోనే టాలీవుడ్‌ స్టార్‌ బ్యానర్‌ సురేష్ ప్రొడక్షన్స్‌లో ‘ఈ నగరానికి ఏమైంది?’ సినిమా చేశాడు. ఇప్పుడు వెంకటేశ్‌తో ఒక స్పోర్ట్స్‌ డ్రామా కూడా చెయ్యబోతున్నాడు.

Read more RELATED
Recommended to you

Exit mobile version