కరోనా కాలంలో లక్కీ బాయ్ ఇతనే…!

-

కరోనా వైరస్ కారణంగా ప్రపంచ వ్యాప్తంగా ఎందరో నష్టపోతున్న తరుణంలో ఒక వ్యక్తికి మాత్రం ఊహించని విధంగా లాభం వచ్చి పడింది. కరోనా కాలంలో లక్కీ బాయ్ అయ్యాడు. మన దేశానికి చెందిన ఒక వ్యక్తి… దుబాయ్‌లోని ఎమిరేట్స్ లోటో ప్రారంభోత్సవ డ్రాలో 350000 దిర్హమ్స్ సొమ్ముని గెలుచుకున్నాడు. మన కరెన్సీ లో ఆ సొమ్ము ఎంత అంటే… సుమారు రూ.73 లక్షలు.

దుబాయ్‌లో టెలి కమ్యూనికేషన్ ఇంజినీర్‌గా పనిచేస్తున్న అని మహ్మద్ ఖలీద్ అనే వ్యక్తి చెప్పాడు. మా టికెట్‌లో ఉన్న ఆరు నెంబర్లు కలవడం చూసి మేం షాక్ తిన్నామని… మీకు లాటరీ తగిలిందంటూ ఎమిరేట్స్ లోటో ప్రతినిధులు ఫోన్ చేసి కన్ ఫాం చేసుకోవడంతో మా ఆనందానికి హద్దుల్లేవని… ఖలీద్ చెప్పారు. ఆయన పదేళ్ళ క్రితం భారత్ నుంచి దుబాయ్ వెళ్ళాడు. తనకు వచ్చిన లాటరీ డబ్బును తన కుటుంబానికి పంచుతా అని అతను చెప్పాడు.

అదే విధంగా యూఏఈ వైస్ ప్రెసిడెంట్, ప్రధానమంత్రి ఇచ్చిన పిలుపు మేరకు ‘10 మిలియన్ రమదాన్ మీల్స్’ కార్యక్రమానికి తన వంతు సాయం చేస్తా అని అతను చెప్పడం గమనార్హం. ఒక్కసారే ఇంత మొత్తం వచ్చి చేరడం తో ఆ కుటుంబం ఆనందానికి అవధాలు లేకుండా పోయాయి, ఏది ఎలా ఉన్నా కరోనా కాలంలో అతను లక్కీ బాయ్ అంటూ పలువురు కామెంట్ చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news