Breaking : ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్ధి ద్రౌపది ముర్మూకు మద్దతు ప్రకటించింది వైసీపీ పార్టీ. స్వతంత్ర భారత చరిత్రలో తొలిసారిగా ఒక గిరిజన మహిళకు ఇవ్వడం శుభ పరిణామం అని వైఎస్‌ఆర్‌సీపీ వెల్లడించింది. ముందుగా రాష్ట్ర మంత్రివర్గ సమావేశాన్ని నిర్ణయించుకున్నందున ఇవాల్టి రాష్ట్రపతి నామినేషన్ కార్యక్రమానికి గైర్హాజరు కానున్నారు సీఎం వైఎస్ జగన్.
గడిచిన మూడేళ్ళుగా సామాజిక న్యాయంలో దేశంలోనే పెద్ద పీట వేస్తున్న పార్టీగా… ద్రౌపది ముర్మూకి మద్దతు తెలుపుతున్నామని వైసీపీ ప్రకటించింది. ద్రౌపది ముర్మూ నామినేషన్‌కు పార్లమెంటరీ పార్టీ నాయకుడు, లోక్‌సభలో పార్టీ పక్ష నేత హాజరు కానున్నారు. కాగా రెండు రోజుల కిందట బిజెపి ప్రభుత్వం.. తమ రాష్ట్రపతి అభ్యర్థిగా ద్రౌపదిని తెర పైకి తీసుకు వచ్చిన సంగతి తెలిసిందే. గిరిజన మహిళా కావడంతో… ప్రతి పక్షాలు సైతం తమకు మద్దతు ఇస్తాయనే నమ్మకంతో ద్రౌపదిని ప్రెసిడెంట్ అభ్యర్థిగా నిలబెట్టింది మోడీ సర్కార్. దీనికి అనుగుణంగానే ఒడిస్సా ప్రభుత్వం మరియు వైసీపీ సర్కార్ మద్దతు తెలిపాయి.