వెనక్కి తగ్గిన ఇండియన్ రైల్వే.. కాషాయ యూనిఫామ్ తొలగింపు

-

ఇండియన్ రైల్వేస్ వెనక్కి తగ్గింది. హిందుత్వ సంస్థల డిమాండుకు తలొగ్గింది. కాషాయ యూనిఫామ్‌ను తొలగించింది. ఎవరైనా మనోభావాలు దెబ్బతిని ఉంటే మన్నించమని క్షమాపణలను కోరింది.

రామాయణ ఎక్స్‌ప్రెస్‌లో సర్వీసింగ్ స్టాఫ్‌‌‌కు కాషాయ యూనిఫామ్ ఇవ్వడంపై పలు హిందు సంస్థలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. సర్వీసింగ్ స్టాఫ్‌కు కాషాయ యూనిఫామ్‌ను ఇవ్వడం హిందూ మతాన్ని అవమానించడమేనని ఉజ్జయిని చెందిన హిందూ సన్యాసులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఒకవేళ యూనిఫామ్‌ను మార్చకుంటే డిసెంబర్ 12న న్యూఢిల్లీలో రామాయణ్ ఎక్స్‌ప్రెస్ రాకపోకలను అడ్డుకుంటామని హెచ్చరించారు.

హిందూ సంస్థల హెచ్చరికలతో దిగి వచ్చిన ఇండియన్ రైల్వేస్ సోమవారం సర్వీసింగ్ స్టాఫ్ యూనిఫామ్‌ను మార్చింది. సర్వీసింగ్ స్టాఫ్ యూనిఫామ్‌ను పూర్తిగా మార్చివేశామని, ఇకపైన ప్రొఫెషన్ దుస్తుల్లోనే సర్వీసింగ్ చేస్తారని ఐఆర్‌సీటీసీ ఓ ప్రకటనలో తెలిపింది. అసౌకర్యం కలిగినందుకు మన్నించమని కోరింది.

షర్ట్, ప్యాంటు ధరించిన రామాయణ ఎక్స్‌ప్రెస్ సర్వీసింగ్ స్టాఫ్ సంప్రదాయ తలపాగను ధరించారు. ఏదిఏమైనా కాషాయ మాస్కులు, గ్లౌవ్స్‌‌ను మాత్రం కొనసాగించారు.

హిందూ సాధువుల మాదిరిగా సర్వీసింగ్ స్టాఫ్ కాషాయ దుస్తులు, రుద్రాక్ష మాలలను ధరించడం హిందూ మాతం, సాధువులను అవమానించడమేనని ఉజ్జయిని అఖాడ పరిషద్ పూర్వ ప్రధాన కార్యదర్శి అవదేశ్ పూరి తెలిపారు. ఒకవేళ యూనిఫామ్‌లో మార్పులు చేయకపోతే ఢిల్లీలోని సఫ్ధార్ జంగ్ రైల్వే స్టేషన్‌లో రామాయణ ఎక్స్‌ప్రెస్ రాకపోకలను అడ్డుకుంటామని హెచ్చరించిన విషయం తెలిసిందే.

ఈ వివాదాన్ని పెద్దది చేయకూడదని, అందరికీ ఆమోదయోగ్యంగా యూనిఫామ్ మార్చాలని నిర్ణయించుకున్నట్లు రైల్వే బోర్డు అధికారులు తెలిపారు. రామాయణ ఎక్స్‌ప్రెస్ తొలి ట్రిప్ నవంబర్ 7న ప్రారంభమైంది. ఇది 17 రోజులపాటు దేశంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలను చుట్టి రానున్నది.

Read more RELATED
Recommended to you

Exit mobile version