నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ బరిలో కవిత.. పోటీకి కాంగ్రెస్, బిజెపి దూరం

-

ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల చుట్టే రాజకీయాలు తిరుగుతున్నాయి. ప్రజాప్రతినిధుల సంఖ్యాబలం టీఆర్ఎస్ పార్టీకి ఎక్కువగా ఉండటంతో అన్ని పదవులు వారికే దక్కుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఇవ్వాళ నిజామాబాద్ లో కల్వకుంట్ల కవిత ఎమ్మెల్సీగా నామినేషన్ దాఖలు చేయనున్నారు. మధ్యాహ్నం రెండు గంటల ప్రాంతంలో కల్వకుంట్ల కవిత నామినేషన్ దాఖలు చేయనున్నారు.

అయితే ఈ నిజామాబాద్ స్థానిక సంస్థల ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ దూరం కానున్నట్లు తాజాగా ప్రకటించింది. అటు భారతీయ జనతాపార్టీ కూడా పోటీ చేయబోమని ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇవాళ టిఆర్ఎస్ అభ్యర్థిగా కవిత నామినేషన్ వేయనున్నారు.

రెండు ప్రధాన ప్రతిపక్షాలు అక్కడి పోటీకి దూరం కావడంతో… ఎమ్మెల్సీగా కవిత ఎన్నిక ఏకగ్రీవం అయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం అందుతోంది. కాగా నిన్నటి రోజున ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నిక పూర్తయింది. ఎమ్మెల్యే కోటా లో ఏకంగా ఆరుగురు ఎమ్మెల్సీలు ఏకగ్రీవం అయ్యారు. నామినేషన్ల గడువు పూర్తికావడంతో ఆ ఆరుగురి ఎన్నిక ఏకగ్రీవం అయినట్లు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version