ఎన్నారైల జేబులకి చిల్లు…ఇలా ఊహించి ఉండరు..!!!

-

భారత పర్యటన ముగించుకొని వెళ్లిన అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ భారతీయులకు గుడ్ న్యూస్ చెప్పబోతున్నారు అంటూ మీడియా మొత్తం కోడైకూసిన విషయం తెలిసిందే. గుడ్ న్యూస్ గురించి ఏమో గానీ ఇప్పుడు అమెరికా వలస వెళ్లాలనుకునే భారతీయుల జేబులకు మాత్రం చిల్లులు పడనున్నట్లు అర్ధం అవుతుంది. ఏప్రిల్ 1 నుంచి అమెరికా వలస వెళ్ళాలి అని అనుకున్న భారతీయులకు ఇమ్మిగ్రేషన్ రుసుము కింద అదనంగా 50,000 డాలర్లు చెల్లించాల్సి ఉంటుందట. అయితే ఈ అదనపు రుసుము అన్ని రకాల వీసా లపై ప్రభావం చూపనుంది. అయితే ఈ అదనపు రుసుము వల్ల ఈబీ-5 వీసా కుండా పెట్టుబడులు పెట్టె వారికి మాత్రం అడ్డంకులు కలిగే అవకాశం ఉంది అంటూ అమెరికన్ బజార్ తన దినపత్రిక కథనంలో ప్రచురించింది. ఈ ఏడాది ఈబీ-5 ఇన్వెస్టర్ వీసా ప్రోగ్రామ్‌లో భాగంగా కనీస పెట్టుబడిని 1990ల తర్వాత 9,00,000లకు పెంచింది. కనీస పెట్టుబడిలో ఈ పెరుగుదలలో 5 శాతం అదనపు పన్నును దరఖాస్తుదారులు తమ దరఖాస్తు ప్రక్రియ కోసం అమెరికాలో ఎస్క్రోఖాతాకు చెల్లించాల్సి ఉంటుంది.

దీనితో అమెరికాకు వెళ్లేముందు భారతీయులు తమ పన్ను స్థితిని జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాలంటూ అమెరికన్ బజార్ గ్లోబల్ ఛైర్మన్ మార్క్ డేవిస్ అన్నారు. ఇప్పటివరకు ఈ వీసా ల కోసం చైనా,వియత్నాం,భారత్ ల నుంచి డిమాండ్ ఎక్కువగా ఉందని చెప్పాలి. అయితే హెచ్ 1 బీ వీసాల ద్వారా అక్కడ గ్రీన్ కార్డు లభించాలి అంటే కనీసం పదేళ్ల సమయం పడుతుంది. కానీ ఈ ఈబీ-5 వీసా ద్వారా దరఖాస్తు చేసుకున్న 3 నుంచి 5 ఏళ్లలోపే గ్రీన్ కార్డు లభించే అవకాశం ఉంటుంది. అందుకే చాలా మంది అమెరికా లో సెటిల్ అవ్వాలి అని అనుకున్న వారు ఈ ఈబీ-5 వీసా కోసమే ఆసక్తి చూపుతున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version