భారత్‌లో కరోనా వైరస్ ప్రభావం రోజురోజుకూ తీవ్రరూపం దాల్చుతోంది. రోజువారీగా నమోదు అవుతున్న పాజిటివ్ కేసుల సంఖ్య అమాంతంగా పెరుగుతోంది. గత 24గంటల్లో దేశవ్యాప్తంగా 78,761 కొత్త కేసులు నమోదుకాగా 948మంది వైరస్‌తో మృతి చెందారు. ప్రస్తుతం 7,65,302 యాక్టివ్ కేసులు ఉండగా.. 27,13,934మంది కరోనా నుంచి కోలుకుని ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. అలాగే.. ఇప్పటివరకు 63,498మంది కరోనానతో మరణించారు. అయితే.. భారత్‌లో రికవరీ రేట్ ఎక్కువగా ఉండడం గమనార్హం. రికవరీరేట్ 76.74% ఉంది.
ఇదిలా ఉండగా.. గత శనివారం వరకు దేశంలో 4.1 కోట్ల కరోనా నిర్ధారణ పరీక్షలు చేశారు. కాగా, ప్రపంచవ్యాప్తంగా 25మిలియన్ల కరోనా కేసులు నమోదు అయ్యాయి. ఇక అమెరికాలో కరోనా కేసుల సంఖ్య 6మిలియన్లకు చేరుకుంది.