మిస్ యూనివర్స్ హర్నాజ్ సంధు.. మీకు తెలియని విషయాలెన్నో!

-

ఇండియాకు చెందిన హర్నాజ్ సంధు చరిత్ర సృష్టించింది. మిస్ యూనివర్స్ 2021గా ఎంపికైంది. 21ఏండ్ల సుదీర్ఘ విరామం తర్వాత భారత్‌కు టైటిల్‌ను తీసుకువచ్చిన ఘనత దక్కించుకుంది.

హర్నాజ్ సంధు ఐదు ముఖ్యమైl అంశాలు మీకోసం

2000లో లారా దత్తా మిస్ యూనివర్స్ కిరీటం దక్కుంచుకున్నది. సరిగ్గా రెండు దశాబ్దాల అనంతరం హర్నాజ్ సంధును టైటిల్‌ను దక్కించుకున్నది. ఇజ్రాయెల్‌లోని ఈలాట్‌లో నిర్వహించిన 71 ప్రపంచ అందాల పోటీలో హర్నాజ్ మిస్ యూనివర్స్ కిరీటం దక్కించుకున్నది.

పుట్టింది, పెరిగింది పంజాబ్ రాష్ట్రంలోనే. చండీగఢ్‌లోని శివాలిక్ పబ్లిక్ స్కూల్, పోస్టు గ్రాడ్యుయేట్ కాలేజ్ ఫర్ గర్ల్స్‌లో గ్రాడ్యుయేషన్ వరకు చదువుకున్నది. ప్రస్తుతం పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్‌లో మాస్టర్స్ చేస్తున్నది.

తన 17ఏండ్ల వయస్సు నుంచి సంధు అందాల పోటీలో పాల్గొంటున్నది. 2017లో మిస్ చండీగఢ్, 2018లో మిస్ మ్యాక్స్ ఎమర్జింగ్ స్టార్‌గా నిలిచింది.

2019లో ఫెమినా మిస్ ఇండియా పంజాబ్ టైటిల్‌ను సొంతం చేసుకున్నది. అదే సంవత్సరం ఫెమినా మిస్ ఇండియాలో చివరి 12 మందిలో ఒకరుగా నిలిచారు.

మిస్ యూనివర్స్ హర్నాజ్ సంధు న్యూయార్క్‌లో నివసిస్తూ ప్రపంచ వ్యాప్తంగా జరుతున్న పలు ఈవెంట్లలో పాల్గొంటున్నది.

Read more RELATED
Recommended to you

Exit mobile version