అంతర్జాతీయ ఆకలి సూచికలో దారుణంగా పడిపోయిన ఇండియా ర్యాంక్‌.. కారణం అదేనా..?

-

అంతర్జాతీయ ఆకలి సూచికలో ఇండియా ర్యాంకు దారుణంగా పడిపోయింది. ఇది నిజమేనా లేక పాశ్చాత్య దేశాల కుట్రా అనేది ప్రశ్నార్థకంగా ఉంది. రష్యా- ఉక్రెయిన్‌ యుద్ధం విషయంలో ఇండియా తీసుకున్న నిర్ణయం వల్లే పాశ్చాత్య దేశాలు ఇండియాను అంతర్జాతీయ వేదికలపై తక్కువగా చేసే ప్రయత్నం చేస్తున్నాయది నిపుణుల అభిప్రాయం. శ్రీలంక, పాకిస్తాన్‌, నేపాల్‌తో పోల్చితే భారత్‌లో తీవ్రమైన పరిస్థితులు ఉన్నాయా?

గ్లోబల్‌ హంగర్‌ ఇండెక్స్‌ ర్యాంకింగ్స్‌ విషయంలో ఇండియా స్పందించింది. మదింపు ప్రక్రియలో తీవ్ర తప్పిదాలున్నాయని ఇండియా వెల్లడించింది. 2021లో 116 దేశాలకు సంబంధించి గ్లోబల్‌ హంగర్‌ ఇండెక్స్‌లో ఇండియా 101వ స్థానంలో ఉండేది. ఇప్పుడు ఈ జాబితాలో 121 దేశాలు చేరాయి. భారత్‌ స్థానం మరింత దిగజారి 107వ స్థానానికి పడిపోయిందని నివేదికలో తెలిపారు. ఈ నివేదిక భారత్‌కు 29.1 స్కోర్‌ ఇచ్చింది. అంతే కాదు భారత్‌లో ఆకలి కేకలు తీవ్రస్థాయిలో ఉన్నాయని విశ్లేషించింది. అంటే.. ప్రపంచంలో ఎక్కడా లేని రీతిలో భారత్‌లో పిల్లల ఎదుగుదల లోపాలు అత్యధికంగా ఉన్నాయని ఈ నివేదిక చెబుతుంది.

ప్రజలకు కావాల్సిన ఆహారం, అవసరమైన పోషకాలు అందించడంలో ఇండియాను తక్కువ చేసి చూపే ప్రయత్నం జరుగుతోందని భారత్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఏటా విడుదల చేసే గ్లోబల్‌ హంగర్‌ ఇండెక్స్‌లో తప్పుడు సమాచారమన్నది హాల్‌మార్క్‌గా నిలుస్తోందని ఇండియా ఆరోపించింది. ఇందులోని నాలుగు సూచికల్లో మూడు పిల్లల ఆరోగ్యానికి సంబంధించినవి, వాటిని మొత్తం జనాభాకు ఎలా అన్వయిస్తారని భారత్‌ ప్రశ్నించింది.

పోషకాలకు సంబంధించి 3వేల మందితో తీసుకున్న శాంపిల్‌ను మొత్తం జనాభాకు ఎలా అంటగడతారని తీవ్రంగా మండిపడింది. గ్లోబల్‌ హంగర్‌ ఇండెక్స్‌లో పిల్లల ఆరోగ్యానికి సంబంధించిన సూచికల్లో శాస్త్రీయతే కాదు హేతుబద్ధత కూడా లోపించిందని తెలిపింది. ఇండియాలోని వాస్తవ పరిస్థితులను ఈ నివేదిక ఏ మాత్రం ప్రతిబింబించడం లేదని తెలిపింది.

ఈ అంచనాలను ఉపయోగించకూడదని ఐక్యరాజ్యసమితికి చెందిన FAOను ఇండియా కోరింది. ప్రపంచంలోనే అతి పెద్ద ఆహార భద్రత పథకాన్ని తాము అమలు చేస్తున్నామనే విషయాన్ని భారత్‌ వివరించింది. ఆహార సబ్సిడీ కింద ఏడాది డిసెంబర్ వరకు 3.91 లక్షల కోట్లు కేటాయించామని ఇండియా తెలిపింది.యూరోప్‌కు చెందిన స్వచ్చంద సంస్థ కన్సర్న్‌ వల్డ్‌వైడ్‌ అండ్ వెల్త్‌ హంగర్‌హిల్ఫ్‌ అనే సంస్థ ఈ నివేదికను వెలువరించింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version