ఇందిరమ్మ ఇళ్లు ఇవ్వాలని ఎంపీడీవో కాళ్లు పట్టుకున్న దళితుడు

-

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న గ్రామ, వార్డు సభలు రసాభాసగా కొనసాగుతున్నాయి. ప్రభుత్వ పథకాలు అన్నింటినీ కాంగ్రెస్ కార్యకర్తలకే కేటాయిస్తున్నారని రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు, నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. ఓ వైపు తమకు ఇచ్చిన హామీలు ఏమయ్యాయని ప్రజలు అధికారులు, కాంగ్రెస్ నేతలను నిలదీస్తున్నారు. ఎమ్మెల్యేలను కూడా ప్రశ్నిస్తున్నారు. ఈ గందరగోళాల మధ్యే మూడో రోజు గ్రామ, వార్డు సభలు కొనసాగుతున్నాయి.

తాజాగా మంత్రి శ్రీధర్ బాబు నియోజకవర్గంలో ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలని ఓ దళితుడు ఎంపీడీవో కాళ్లు పట్టుకున్నాడు. అయితే, ఎక్కువ మాట్లాడుతున్నావ్ పోలీసులకు చెప్పి కేసు పెట్టిస్తా అని ఆ దళితుడిని అధికారులు భయపెట్టినట్లు తెలుస్తోంది.మంథని నియోజకవర్గంలోని కాటారం మండలం చిదినేపల్లి గ్రామ సభలో ఈ ఘటన వెలుగుచూసింది. ప్రజాపాలన అంటే ఇదేనా, అడిగితే కేసులు పెడుతామని భయపెట్టిస్తారా? అని గ్రామస్తుల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news