ఇండస్ట్రీ చూపులన్నీ ఆ రెండు సినిమాల మీదే.. దారి చూపెడతాయా?

-

కరోనా కారణంగా థియేటర్లన్నీమూతబడి ఉన్నాయి. తొమ్మిది నెలలుగా థియేటర్లలో బొమ్మ పడలేదు. నెల రోజుల క్రితం నుండి అక్కడక్కడా థియేటర్లు తెరుచుకున్నప్పటికీ యాభై శాతం సీటింగ్ సామర్థ్యం కారణంగా కొత్త సినిమాలని విడుదల చేయడానికి నిర్మాతలు ఆసక్తి చూపలేదు. దాంతో పాత సినిమాలు చూడడానికి ప్రేక్షకులు థియేటర్లకి రాలేదు. ఐతే తాజాగా తెలుగు సినిమా పరిశ్రమ నుండి రెండు కొత్త సినిమాలు, జనాల్లో క్రేజ్ ఉన్న సినిమాలు థియేటర్లలో సందడి చేయనున్నాయి.

సాయి ధరమ్ తేజ్ నటించిన సోలో బ్రతుకే సో బెటరు, మాస్ మహారాజ్ నటించిన క్రాక్.. ఈ రెండు చిత్రాలు విడుదల తేదీని ప్రకటించాయి. క్రిస్మస్ కానుకగా సోలో బ్రతుకే సో బెటరు థియేటర్లలో సందడి చేయనుంది. అలాగే సంక్రాంతి కానుకగా క్రాక్ థియేటర్లలోకి రానుంది. ఈ రెండు చిత్రాల మీదే అందరి చూపులు నిలిపి ఉంచారు. యాభై శాతం సీటింగ్ సామర్థ్యం, కరోనా టైమ్ వంటి రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నప్పటికీ ధైర్యం చేసి రిలీజ్ చేస్తున్నందున ప్రేక్షకులు థియేటర్లలోకి వస్తారా లేదా అని అందరూ ఎదురుచూస్తున్నారు.

ఈ రెండు సినిమాల ఫలితం మీదే మిగతా సినిమాలు రిలీజ్ చేయాలా వద్దా అని ఆలోచిస్తారు. కొంచెం అటు ఇటు అయినా మళ్ళీ సినిమా పండగ వేసవికి వాయిదా పడిపోతుంది. చూడాలి మరి ఏం జరగనుందో..!

Read more RELATED
Recommended to you

Exit mobile version